NTV Telugu Site icon

Salaar: ఆ నిమిషం 25 సెకండ్స్ ఏముంది నీల్ బ్రో… కాస్త లీక్ చెయ్యొచ్చుగా…

Salaar

Salaar

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ తెస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేసాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకొని డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది సలార్ సీజ్ ఫైర్. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సూరీడే సాంగ్స్ తో హైప్ ని మరింత పెంచాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ చేయబోయే ర్యాంపేజ్ ఏ రేంజులో ఉండబోతుందో సలార్ శాంపిల్ చూపించడానికి రిలీజ్ ట్రైలర్ బయటకు రానుంది. ఈ ట్రైలర్ తో రాబోయే నాలుగు రోజులు సలార్ మేనియా మాత్రమే ఉండేలా చేస్తుందని సమాచారం.

ఇదిలా ఉంటే సలార్ సినిమాకి సెన్సార్ A సర్టిఫికేట్ ఇచ్చింది. యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో A రేటెడ్ సినిమాగా నిలిచింది సలార్. సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం సలార్ సినిమా 2 గంటల53 నిమిషాల నిడివితో ఉంది అనే మాట వినిపించింది. లేటెస్ట్ గా ఈ నిడివి మరింత పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. సలార్ సినిమా నిమిషం 25 సెకండ్ల నిడివి పెరిగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ పెరిగిన నిడివి సినిమా ఎండ్ లో పోస్ట్ క్రెడిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎండ్ లో సలార్ 2కి లీడ్ ఇస్తూ క్లిప్స్ ఉంటాయా లేక 2లోని సీన్స్ ప్లే చేస్తారా? KGF అండ్ సలార్ ని లింక్ చేస్తారా? అసలు ఆ నిమిషమున్నర నిడివి ఎందుకు పెరిగింది? అక్కడ ఏ ఫుటేజ్ ని ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఈ డౌట్ క్లియర్ అవ్వాలి అంటే డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే.

Show comments