Site icon NTV Telugu

Salaar: కింగ్ ఖాన్ గడ్డని డైనోసర్ కబ్జా…

Salaar

Salaar

రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని మాస్ మేనియాలో ముంచెత్తడానికి సలార్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానున్న సలార్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనే అంచనాలు వేస్తూ ట్రేడ్ వర్గాలు బిజీగా ఉన్నాయి. సలార్ నుంచి ఫైనల్ రిలీజ్ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కొన్ని నిమిషాల్లో సలార్ రిలీజ్ ట్రైలర్ బయటకి రానుంది. ఈ ట్రైలర్ కూడా బయటకి వచ్చేస్తే సలార్ సినిమాపై ఇప్పటికే ఉన్న హైప్ ఆకాశాన్ని చేరుతుంది. ఇదిలా ఉంటే అన్ని సెంటర్స్ లో సలార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బెంగళూరు, కేరళ రాష్ట్రం అనే తేడా లేకుండా సలార్ బుకింగ్స్ ఫైర్ మోడ్ లో ఉన్నాయి.

ఇక్కడ విశేషం ఏంటంటే సలార్ బెంగళూరు బుకింగ్స్ మాత్రమే షారుఖ్ డంకీ పాన్ ఇండియా బుకింగ్స్ కన్నా ఎక్కువ. ఈ ఒక్కటి చాలు డంకీ సినిమాని సలార్ ఎలా డామినేట్ చేస్తుందో చెప్పడానికి. బుకింగ్స్ విషయంలోనే కాదు మాస్ సెలబ్రేషన్స్ విషయంలో కూడా షారుఖ్ అడ్డా అయిన నార్త్ ఇండియా, స్పెషల్ గా ముంబైలో సలార్ కి భారీ కటౌట్స్, ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇప్పటికే సగం ముంబైని సలార్ కబ్జా చేసేసింది. షారుఖ్ ని సొంత గడ్డపైనే డామినేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా ప్రైమ్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ని బీట్ చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్.

Exit mobile version