ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక్కటే మాట వినిపిస్తుంది.. అదే సలార్.. ఈ సినిమా నిన్న విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. సినిమా హిట్ అవ్వడమే కాదు కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. బాహుబలి తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.. ఇన్నాళ్లకు ఈ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రభాస్ సినిమా హిట్ అయితే ఎప్పుడెప్పుడు కాలర్ ఎగరేవేసుకొని తిరుగుదామా అని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న ప్రభాస్ అభిమానులకు సలార్ సినిమా తలెత్తుకునేలా చేసింది…
ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారు.. ప్రతి ఒక్కరు వారి పాత్రలకు న్యాయం చేశారు.. ఇందులో ప్రభాస్ కు ఎక్కువగా డైలాగులు లేకపోయినప్పటికీ ఆయన కటౌట్ తోనే అందర్నీ మెప్పించారు. ఆయన కటౌట్ కి ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇదంతా పక్కన పెడితే సలార్ సినిమాలోని ఒక కుర్రవాడు గురించి ప్రస్తుతం నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఆ కుర్రాడు అద్భుతంగా చేశాడు.. ఇంతకీ ఎవరు ఆ కుర్రాడు అంటూ తెగ వెతికేస్తున్నారు..
ఆ కుర్రాడు మరెవ్వరో కాదు టాలివుడ్ సీనియర్ హీరో రవితేజ కు బంధువు అవుతాడు.. అబ్బాయి పేరు కార్తికేయ దేవ్. ఈయన టాలీవుడ్ హీరో రవితేజ కజిన్ బ్రదర్ కొడుకు అని తెలుస్తోంది అంటే వరసకి రవితేజ కి వరుసకు కొడుకే అవుతాడు. కార్తికేయ దేవ్ పదవ తరగతి చదువుతున్నాడట. ఇక ఈ సినిమాలోని పృథ్వి రాజ్ చిన్నప్పటి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేసి చివరికి కార్తికేయ దేవ్ ని తీసుకున్నారట ప్రశాంత్ నీల్. ఇక సినిమా కోసం నెల రోజుల పాటు రిహార్సల్స్ చేసి 15 రోజుల్లో ఈయన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని కంప్లీట్ చేశారని కార్తికేయ దేవ్ ఓ ఇంటర్వ్యూ లో దేవ్ చెప్పారు.. తర్వాత సినిమా ఆఫర్స్ వస్తే చేస్తానని కూడా చెప్పాడు..