NTV Telugu Site icon

Prabhas: ‘సలార్’ ఫ్యాన్స్‌కు సలామ్ కొట్టాల్సిందే!

Salaar Bookings

Salaar Bookings

నిజమే… ఈ విషయంలో మాత్రం సలార్ ఫ్యాన్స్‌కు సలామ్ కొట్టాల్సిందే లేదంటే… ఇంత హైప్, ఈ రేంజ్ రచ్చ ఉండేది కాదు. మామూలుగా అయితే ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మూవీ మేకర్స్‌దే. అందుకోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయాలి. పాన్ ఇండియా సినిమాకైతే… దేశం మొత్తం చుట్టేయాలి. గతంలో బాహుబలి2, ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌ను గట్టిగా చేశాడు రాజమౌళి. తన హీరోలను వెంటబెట్టుకొని దేశమంతా తిరగాడు కానీ సలార్ వ్యవహారం మాత్రం రివర్స్‌లో ఉంది. ఈ సినిమాకు హోంబలే ఫిల్మ్స్ గానీ, ప్రశాంత్ నీల్ గానీ, ప్రభాస్ గానీ ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. ఏదో నామ మాత్రంగా ఒకటి రెండు ఇంటర్వ్యూలతో సరిపెట్టారు. కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఉంటుందని భావించారు. అది కూడా చేయలేదు… పట్టుమని సినిమా రిలీజ్‌కు మరో పది రోజులు ఉందనగా… జస్ట్ ట్రైలర్స్, రెండు సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేశారు కానీ అనౌన్స్మెంట్ నుంచే సలార్ పై భారీ హైప్ క్రియేట్ అయింది.

సినిమా ఎన్నిసార్లు వాయిదా పడ్డ కూడా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవలేదు. మేకర్స్ సలార్‌ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా సరే… ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తునే వచ్చారు. ఇక అఫీషియల్ అప్డేట్ బయటికొచ్చినప్పుడు… సలార్‌ను నేషనల్ వైడ్‌ ట్రెండ్ చేశారు. ప్రభాస్‌కు హిట్ పడాలని… మేకర్స్ కంటే ఎక్కువగా సలార్‌ను అభిమానులే ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఇక సినిమాకు హిట్ టాక్ రావడంతో ఒక్కసారిగా అంతా సోషల్ మీడియాపై పడిపోయారు. ఒంటిగంట షో నుంచే సలార్‌పై భారీ పాజిటివ్ హైప్ క్రియేట్ చేశారు. దీనికి తోడు మౌత్ టాక్ బాగుంది కాబట్టి… మూడు రోజుల్లో 400 కోట్లు, ఐదు రోజుల్లో 500 కోట్లు రాబట్టింది సలార్. ఫాన్స్ నుంచి ఈ రేంజ్ సపోర్ట్ ఉన్నా కూడా మేకర్స్ మాత్రం… ఇప్పటికీ కనీసం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం సలార్ సక్సెస్‌ను తమ సక్సెస్‌లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకేనేమో… సలార్ మేకర్స్ రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు. సలార్ క్రేజ్, ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి వాళ్లకు భారీ హైప్ ఇచ్చింది. ఏదేమైనా సరే… సలార్ ఫ్యాన్స్‌కు మాత్రం మేకర్స్ సలామ్ కొట్టాల్సిందే.