NTV Telugu Site icon

Salaar: సలార్ టికెట్స్ కోసం పడిగాపులు.. తొక్కిసలాట.. ఏదైనా జరిగితే ఎవరు సర్ రెస్పాన్సిబిలిటీ..?

Prabhs

Prabhs

Salaar: ఒకప్పుడు సినిమాకు వెళ్ళాలి అంటే.. బండి కట్టించుకోవాలి.. టైమ్ కు వెళ్ళాలి.. క్యూ లో నిలబడాలి.. టికెట్ తీసుకోవాలి. ఇక స్టార్ హీరో సినిమా అయితే తొక్కిసలాట జరిగినా కూడా టికెట్ మాత్రం మన చేతికి రావాలి.. అసలు ఆ టికెట్ మన చేతిలో ఉంటే ప్రపంచాన్ని జయించేసిన ఫీలింగ్ వస్తుంది. చెప్పాలంటే ఆ రోజులే వేరు అనుకున్నవారు లేకపోలేదు. కానీ, అలాంటి రోజులే ఇప్పుడు మళ్లీ వచ్చాయి. అందుకు కారణం సలార్. ప్రభాస్, శృతి హాసన్ జంటగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ కానుంది. ఎన్నోరోజులుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైంది.

మరో మూడు రోజుల్లో సలార్ థియేటర్ లో అడుగుపెడుతుంది. ఇక అన్ని సినిమాల్లా.. టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ఆన్ లైన్ లో కాకుండా కౌంటర్ వద్ద తీసుకోవాలని చెప్పడంతో.. థియేటర్ లు దద్దరిల్లిపోతున్నాయి. అర్ధరాత్రి నుంచి థియేటర్ ల వద్ద అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. సలార్ టికెట్స్ కోసం ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ప్రతి థియేటర్ వద్ద ఇదే పరిస్థితి. ఇక తొక్కిసలాటలో చాలామంది అభిమానులు గాయాలపాలవుతున్నారు కూడా. అయితే ఇది మంచి పద్దతి కాదు అని పలువురు నొక్కివక్కాణిస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్.. అన్ని ఆన్ లైన్ లోనే చేస్తుంది. టైమ్ సేవింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సలార్ టికెట్స్ కోసం ఇలా పడిగాపులు కాయడం వలన టైమ్ వేస్ట్ అని, ఎంతో ట్రాఫిక్ నిలిచిపోతుందని, దీనివలన పోలీసులు సైతం ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. చెప్పాలంటే వాళ్లు చెప్పిందాంట్లో కూడా నిజం లేకపోలేదు.

ఒకప్పుడు టెక్నాలిజీ లేదు కాబట్టి.. పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంతా ఆన్ లైన్ అన్నప్పుడు ఇలా టికెట్ కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు.. తొక్కిసలాట అసలు అవసరమే లేదు. ఇలా టికెట్స్ కోసం గొడవలు పడి.. తొక్కిసలాటలో ఎవరైనా ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ..? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ పద్దతి అయితే మంచిగా లేదని పెదవి విరుస్తున్నారు. ఇంకా ఏపీలో బుకింగ్స్ ఓపెన్ చేయలేదు.. అక్కడ ఓపెన్ చేస్తే.. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.