Site icon NTV Telugu

Salaar: బిగ్ బ్రేకింగ్.. మరోసారి సలార్ వాయిదా.. ?

Prabhas

Prabhas

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదు వార్త. ఎన్నాళ్ళ నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈరోజో.. రేపో టీజర్, సాంగ్ రిలీజ్ అవుతుందని ఆశపడిన అభిమానులకు నిరాశచెందే ఒక విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పటికే సెప్టెంబర్ లోకి అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ సినిమా కోసం.. అప్డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గతేడాది ఏప్రిల్ 24 నే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అప్పుడు కూడా కొన్ని కారణాల వలన ఈ సినిమా సెప్టెంబర్ కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

సీజీ వర్క్ పట్ల దర్శకుడు అసంతృప్తిగా ఉన్నారట.. అంతేకాకుండా కొన్ని షాట్లు మళ్లీ ఇచ్చారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా అనుకున్న టైమ్ కు రావడం లేదట. ఇప్పటికే మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కు నెమ్మదిగా చెప్పుకొస్తున్నారని సమాచారం. ఈ లెక్కన చూస్తే సెప్టెంబర్ 28 న సలార్ రావడం కష్టమని.. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. సలార్ సినిమాపైనే తాము ఆశలన్నీ పెట్టుకున్నామని, ఇది కూడా ఇలా లేట్ అయితే ఉన్న ఇంట్రెస్ట్ పోతుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Exit mobile version