Pooja Vishweshwar: హిట్ అయ్యిన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసినా కూడా వారికి పేరు వస్తుంది. అలా పేరు తెచ్చుకొని స్టార్లు అయినవారు చాలామందిస్టార్లుగా మారారు. ఇక గతేడాది రిలీజ్ అయిన సలార్ సినిమా చాలామంది చిన్న చిన్న నటులకు గుర్తింపు తెచ్చేలా చేసింది. అందులో పూజ విశ్వేశ్వర్ ఒకరు. కాటేరమ్మ ఫైట్ సీన్ లో దొరసాని లా రెడీ చేస్తా అని చెప్పి వెళ్తుంది కదా. ఆమె పూజ. ఈ సీన్ ఎంత ఫేమస్ అయ్యిందో పూజా కూడా అంతే ఫేమస్ అయ్యింది. ఇక ఆమె విశాఖపట్నం నుంచి వచ్చింది. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు అందుకున్న పూజకు ప్రమాదం జరిగింది.
వైజాగ్‌లోని అనకాపల్లి హైవేపై వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి డివైడర్‌ని ఢీకొట్టింది. దీంతో ఈమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను పక్కనే ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ముఖంపై బలమైన గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది. ప్రాణాలకు ఏమి ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ .. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
