2024 డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ కి సెగలు పుట్టించాడు ప్రభాస్. ఆరేళ్లుగా సరైన హిట్ లేని రెబల్ స్టార్ సలార్ సీజ్ ఫైర్ తో కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఖాన్సార్ ని మాత్రమే కాదు పాన్ ఇండియాని ఎరుపెక్కిస్తూ ప్రభాస్ సలార్ సినిమాతో దాదాపు 700 కోట్ల వరకూ కలెక్షన్స్ ని రాబట్టాడు. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన సలార్ సినిమా నుంచి పార్ట్ 2 ఎప్పుడు బయటకి వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 1 సీజ్ ఫైర్ ఎండ్ లోనే పార్ట్ 2కి లీడ్ ఇస్తూ ‘శౌర్యంగ పర్వం’ సినిమాకి లీడ్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సీజ్ ఫైర్ ఎత్తేసిన తర్వాత ఖాన్సార్ లో ఎలాంటి యుద్ధం జరగబోతుందో చూపిస్తూ శౌర్యంగ పర్వం రూపొందనుంది. ఈ మచ్ అవైటెడ్ సీక్వెల్ గురించి ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ విషయాలని రివీల్ చేసాడు.
సలార్ సక్సస్ విషయంలో ప్రభాస్ చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పిన విజయ్… “సీజ్ ఫైర్ సినిమాలో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయిపొయింది ఇక వీళ్ల వార్ ని పార్ట్ 2లో చూడబోతున్నారు, శౌర్యంగ పర్వం ఎమోషన్స్ అండ్ యాక్షన్ స్కేల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభాస్ త్వరలోనే శౌర్యంగ పర్వం షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. దాదాపు 2025లోనే శౌర్యంగ పర్వం సినిమా వస్తుంది” అని చెప్పాడు. అయితే విజయ్ చెప్పినంత ఈజీగా శౌర్యంగ పర్వం 2025లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. కల్కి, మారుతీ సినిమాలు కంప్లీట్ అవ్వాలి… ఆ తర్వాత హను రాఘవపూడి సినిమా ఉంది, స్పిరిట్ ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలని హోల్డ్ చేసి శౌర్యంగ పర్వం సినిమాని ప్రభాస్ స్టార్ట్ చేస్తే విజయ్ చెప్పిన 2025 రిలీజ్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్ విజయ్ చెప్పిన మాట నిజమైతే సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం ఇండియన్ బాక్సాఫీస్ చూసిన బిగ్గెస్ట్ హిట్ గా చరిత్రలో నిలిచిపోతుంది.
