NTV Telugu Site icon

Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్

Salaar 2 Update

Salaar 2 Update

Salaar 2 shoot to begin in Ramoji Film City: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా 2023 డిసెంబర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే రెండవ భాగం కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పట్లో ఆ సినిమా ఉండకపోవచ్చు అని ప్రచారం జరిగింది. ఎందుకంటే ప్రభాస్ లైనప్లో చాలా సినిమాలు ఉన్నాయి. కాబట్టి సలార్ 2 సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు అని అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు మరి కొద్ది రోజుల్లోనే సలార్ 2 సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ నెలాఖరులో రామోజీ ఫిలిం సిటీలో పది రోజుల షెడ్యూల్ తో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గత మూడు నెలల నుంచి ప్రశాంత్, అతని టీం మొత్తం కలిసి సలార్ 2 స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారని అది ఒక కొలిక్కి రావడంతో ఈ నెలాఖరు నుంచి పది రోజుల పాటు షూట్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Faria Abdullah: ప్రభాస్ ఎక్కడికెళ్లినా వాళ్ళు ఉండాల్సిందే.. సీక్రెట్ బయటపెట్టిన చిట్టి!

అంతేకాదు మరో ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే ఈ ఏడాదిలో సలార్ 2 షూటింగ్ పూర్తి చేస్తారని, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే దాదాపుగా ప్యాచ్ వర్క్ లు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళతారని చెబుతున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీతో పాటు బెంగుళూరు అవుట్ స్కర్ట్స్ లో ప్రత్యేకమైన సెట్స్ నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది చివరిలోపు సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. షూట్ మొదటి భాగం ఎలాగో డిసెంబర్లో వచ్చింది కాబట్టి రెండో భాగాన్ని కూడా డిసెంబర్ 2025లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక మొదటి భాగంలో రివిల్ చేసినట్లుగా ప్రాణ స్నేహితులుగా ఉన్న పృథ్వీరాజ్, ప్రభాస్ ఎలా ప్రాణాలు తీసుకునేంత శత్రువులు అయ్యారు అనే లైన్ లోనే సినిమా సాగనుంది.

Show comments