ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే సినిమాల్లో సలార్ ఒకటి. ప్రభాస్ ఎలివేషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో చూపించిన ప్రశాంత్ నీల్‌తో ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో, ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్-2 మీద మేకర్స్ అధికారికంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ సలార్-2 సినిమాను కూడా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి, ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే సలార్-2 ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ క్రమంలోనే సలార్-2కి హింట్ ఇస్తూ, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలిసిన ప్రశాంత్ నీల్‌తో కలిసి ఉన్న ఫొటోను విడుదల చేశారు. సలార్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ ఫొటోను షేర్ చేసి, వీలైనంత త్వరగా సలార్-2 ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఇతర సినిమాల నుంచి కూడా పలు అప్‌డేట్స్ విడుదల చేస్తున్నారు. అయితే, ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫౌజీ వీడియో మాత్రం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. నిజానికి, ఈరోజు ఒక అప్‌డేట్ ఇస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో, ఈ అప్‌డేట్ కోసం ప్రభాస్ అభిమానులే కాకుండా సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Salaar 2

