NTV Telugu Site icon

Sakshi Shivanand: ఒకప్పటి కుర్రాళ్ల కలలరాణి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

Sakshi

Sakshi

Sakshi Shivanand: సాక్షి శివానంద్.. ఇప్పుటి జనరేషన్ అబ్బాయిలకు ఈ పేరు తెలియకపోవచ్చు కానీ 90’s అబ్బాయిలను అడిగితె.. మా కలలరాణి అని టక్కున చెప్పుకొచ్చేస్తారు. 1993 లో అన్నా వదిన అనే సినిమాతో సాక్షి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక ఆ తరువాత హిందీ, తమిళ్, మలయాళంలో చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక చిరంజీవి సరసన మాస్టర్ లో మెరిసి.. టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో సాక్షి స్టార్ గా మారింది. నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, నవీన్, మోహన్ బాబు, జగపతిబాబు.. ఇక అప్పట్లో కుర్ర హీరోగా వచ్చిన మహేష్ బాబుతో కూడా ఆమె నటించి మెప్పించింది. సాక్షి నటించిన సినిమాలు సగానికిపైగా హిట్స్ ను అందుకున్నాయి. ఆమె అందానికి దాసోహం అవ్వని కుర్రాళ్ళు అప్పట్లో లేరు అంటే అతిశయోక్తి కాదు.

పాలమీగడలాంటి దేహంతో ఆమె అందాలను ఆరబోస్తుంటే.. కన్నార్పకుండా చూసేవారు. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే సాక్షి ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె కథానాయికగా కనిపించిన చివరి సినిమా సింహరాశి. ఆ తరువాత 2008 లో హోమం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. మధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసి మెప్పించిన ఆమె.. ఆ తరువాత పూర్తిగా ఇండస్ట్రీకి కనుమరుగయ్యింది. ఇక సాక్షి ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడి.. హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యిందని సమాచారం. మధ్యమధ్యలో సాక్షి చెల్లెలు శిల్ప.. తన అక్కతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉండడం తప్ప.. సాక్షి మాత్రం కెమెరా కంటికి కూడా కనిపించలేదు. ఇక ఇన్నేళ్ల తరువాత సాక్షి కెమెరా కంటికి చిక్కింది. ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో ఆమె తన చెల్లెలుతో కలిసి సందడి చేసింది. కొద్దిగా రూపు రేఖలు మారాయేమో కానీ, సాక్షి అంతే అందంగా కనిపించింది. దీంతో సాక్షి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మరి తనకు ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ.. ఒకవేళ వస్తే కనుక మంచి అవకాశాలు వస్తాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు.