Sakshi Agarwal: ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక సినిమా మొదలయ్యింది అంటే.. అది రిలీజ్ అయ్యేవరకు ఎవరు సినిమాలో ఉంటారు.. ? ఎవరు పోతారు .. ? అనేది చెప్పడం చాలా కష్టం. ముందు హీరోయిన్ గా అనుకున్నవారు కొన్ని కారణాల వలన సెకండ్ హీరోయిన్ గా మారతారు. క్యారెక్టర్ ఆర్టిస్ ల గురించి అయితే చెప్పనవసరమే లేదు. సినిమా రిలీజ్ అయ్యాకా ఉంటారో.. ఎడిటింగ్ లో వెళ్ళిపోతారో తెలియదు. ఆ తరువాత ఆ డైరెక్టర్లను సదురు నటీనటులు తిట్టిపోయడం సర్వ సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. తాజాగా నటి సాక్షి అగర్వాల్ కూడా అలానే డైరెక్టర్ అట్లీపై విమర్శలు చేసింది. కోలీవుడ్ నటి సాక్షి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఆమె మోడల్ గా చేసే రోజుల్లో రాజారాణి సినిమా ఆఫర్ వచ్చిందంట. ఆర్య, నయనతార జంటగా నటించిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ అని చెప్పి సాక్షి అగర్వాల్ ను అప్రోచ్ అయ్యారట. ఆర్య హీరో అవడం, సెకండ్ హీరోయిన్ అనడంతో ఆమె కూడా ఓకే చెప్పిందంట.
“రాజారాణి సినిమా షూటింగ్ కు వెళ్లాను. నా మీద చాలా సీన్స్ చేశారు. ముఖ్యంగా షాపింగ్ మాల్ లో సీన్స్ తో పాటు ఇంకొన్నీ సీన్స్ కూడా షూట్ చేశారు. ఇక రిలీజ్ తరువాత నా సీన్స్ మొత్తం తీసేశారు. థియేటర్ లో నేను చూసి షాక్ అయ్యాను. అదే సమయంలో దీని గురించి నేను దర్శకుడు అట్లీతో మాట్లాడి ఉండుంటే బాగుండేది. ఆయనతో మాట్లాడకపోవడం నా తప్పు అయింది. హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని అట్లీ మోసం చేశాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.