NTV Telugu Site icon

Sakhi: క్లాసిక్ టైటిల్ తో మూవీ.. డిసెంబర్ 15న థియేటర్స్ లోకి

Sakhi Movie

Sakhi Movie

Sakhi Movie to Release on December 15th: సఖి మూవీ ఒకప్పుడు కుర్రకారును ఎంతగా ఉర్రూతలు ఊగించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మణిరత్నం కెరీర్ లో అద్భుతమైన ప్రేమ కథా చిత్రం సఖి. మాధవన్ , షాలినీ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయింది. తమిళంలో అలై పాయుదే గా తెరకెక్కిన సినిమాకిది డబ్బింగ్ వెర్షన్. అయితే ఇప్పుడు అదే క్లాసిక్ మూవీ పేరుతో ఒక సినిమా తెరకెక్కించారు. వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వస్తున్న సినిమా సఖి. లోకేష్ ముత్తుముల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల, సందీప పసుపులేటి, సుధాకర్ రెడ్డి , జ్యోతి స్వరూప్, జితిన్ ఆదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారా జానీ బాషా దర్శకుడిగా పరిచయం అవుతుండగా పార్థు రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

Pushpa 2: కేశవ కోసం రంగంలోకి పుష్ప యూనిట్?

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సఖి సినిమా డిసెంబర్ 15న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని అంటున్నారు. ప్రేమించి, పెళ్లి చేసుకున్న జంటకు జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా కథాంశం ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు యువత నుంచి విశేష స్పందన లభించిందని, సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సన్నీ సంకురు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సతీష్ కుమార్ కారే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.