Site icon NTV Telugu

Sajjanar: ఒక అవ‌కాశం ఇచ్చి చూడండి సార్.. కీరవాణికి సజ్జనార్ రిక్వెస్ట్!

Keeravani

Keeravani

టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదని చెబుతూ ఉంటారు పెద్దలు. అందుకే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో అంత ఈజీగా బయటపడదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాజీ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుత ఆర్టీసీ ఎండి సజ్జనార్ మాత్రం సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన అన్ని వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆర్టీసీ బస్సులో ఒక అంధ యువకుడు పాడుతూ ఉన్న ఒక వీడియోని షేర్ చేసి మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ అంధ యువకుడు కూడా అద్భుతంగా పాడారు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సార్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Komatireddy Venkat Reddy: చిన్న సినిమాలు తీసేవాళ్లకి థియేటర్లు ఇప్పించే బాధ్యత నాది!

ఇక వీడియో గమనిస్తే కళ్ళు లేని ఒక దివ్యాంగుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఉండగా శ్రీ ఆంజనేయం సినిమాలోని రామ రామ రఘురామ అనే సాంగ్ పాడుతూ కనిపించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు అప్పట్లో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సజ్జనార్ ఆర్టీసీ ఎండి కాబట్టి వీడియో షేర్ చేసి ఉండవచ్చు కానీ కీరవాణి గారిని ఎందుకు ట్యాగ్ చేశారు అని చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా సంగీత దర్శకుడు మణిశర్మ కాగా పొరపాటున కీరవాణి అని టైప్ చేశారా లేక తనతో ఉన్న పరిచయంతో ఆయనకు అవకాశం ఇచ్చి చూడమని టాక్ చేశారా అని చర్చ జరుగుతోంది.

Exit mobile version