NTV Telugu Site icon

Sai Pallavi: అరేయ్.. మీకసలు బుద్దుందా.. ఏది చెప్తే అది నమ్మేయడమేనా

Pushpa 2

Pushpa 2

Sai Pallavi: స్టార్ హీరోల సినిమాలు సెట్ మీదకు వెళ్లాయి అంటే.. అవి రిలీజ్ అయ్యేవరకు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటాయి. హీరో పక్క ఆ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తోంది.. ఈ హీరోయిన్ నటిస్తోంది. ఈ సత్తార్ హీరో క్యామియో చేస్తున్నాడు. హీరోయిన్ చనిపోతుంది.. ఆ ప్లేస్ లో ఇంకో హీరోయిన్ వస్తుందట.. ఒకటి కాదు రెండు కాదు. అందులో నిజాలు ఉన్నాయో లేదో పక్కన పెడితే.. ఈ రూమర్స్ వలన సినిమాపై అంచనాలు మాత్రం ఒక్కసారిగా పెరిగిపోతుంటాయి. మొన్నటికి మొన్న షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో అల్లు అర్జున్ జ్ క్యామియో అని అనగానే.. అమ్మ బాబోయ్. ఎంత పెద్ద క్యామియో. బన్నీ ఉంటే ఇంకేమైనా ఉందా.. రచ్చ రచ్చ అనే సోషల్ మీడియాలోట్రెండ్ చేశారు. ఆ తరువాత అదంతా ఫేక్ అనగానే ఎంత రచ్చ చేశారో అంత సైలెంట్ గా మారిపోయారు. అసలు ఈ రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియదు కానీ, వారు దొరికితే మాత్రం మాములుగా కొట్టకూడదు అంటూ బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Koratala Shiva: కొరటాల శివ.. ఆ పని చేయవలసిందేనా!?

ఇక తాజాగా అలంటి రూమర్ నే మొరొకరి క్రియేట్ చేశారు కొందరు. అదేంటంటే.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది అని ఉదయం నుంచి సోషల్ మీడియా కోడై కూస్తోంది. మొన్నటి వరకు ఈ సినిమాలో రష్మిక పాత్ర చనిపోతుందని, ఆ ప్లేస్ లో మరో హీరోయిన్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ పాత్ర కోసమే సాయి పల్లవిని ఓకే చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వార్త ఎవరు సృష్టించారో తెలియదు కానీ, ఇదంతా పచ్చి అబద్దమని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అసలు సాయి పల్లవి ని ఈ సినిమా కోసం ఎవరు సంప్రదించింది లేదట. అసలు పుష్ప 2 లో ఇంకో హీరోయిన్ కూడా లేదట. ఎవడో ఏదో చెప్తే దాన్ని ట్రెండ్ చేయడం ఏంటి మీకసలు బుద్దుందా.. ఏది చెప్తే అది నమ్మేయడమేనా అని పుష్ప 2 యూనిట్ లో వారు బన్నీ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసారని టాక్. ఏదిఏమైనా ఈ కాంబో రావాలని ఆశపడిన అభిమానులకు నిరాశే మిగిలిందని చెప్పాలి. డెఫినెట్ గా భవిష్యత్తులో మాత్రం బన్నీ- సాయి పల్లవి కాంబో వస్తుందని చెప్పొచ్చు. అప్పటివరకు ఆగడమే తప్ప ఇలాంటి రూమర్స్ ను నమ్మకుండా ఉంటేనే మంచిదని బన్నీ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Show comments