Site icon NTV Telugu

Saindhav: ఎవడ్రా విక్రమ్.. మా సైంధవ్ ను చూడండి..

Venky

Venky

Saindhav: ఈ మధ్యకాలంలో యాక్షన్ సినిమాలు ట్రెండ్ నడుస్తోంది. హీరో.. విలన్స్ ను చితకబాదేస్తూ ఉంటే థియేటర్స్ లో విజిల్స్ పక్కా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనిమల్, సలార్ అలానే అభిమానులను అలరించాయి. ఇప్పుడు ఈ తరహాలనే వెంకటేష్ సైంధవ్ సినిమాతో వస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ద శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్య, నవాజుద్దీన్ సిద్దిఖీ, రుహాని శర్మ, ఆండ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం యాక్షన్ తో నింపేశారు. సైకోగా వెంకీ మామ కనిపించాడు.

ట్రైలర్ లో వెంకీ మామ యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు కూతురు ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక తండ్రిగా సైంధవ్ ఏం చేశాడు అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ట్రైలర్ లో వెంకీ ఫైట్స్ చూస్తే.. కోలీవుడ్ లో విక్రమ్ సినిమా గుర్తుకువస్తుందని చెప్పుకొస్తున్నారు. శైలేష్ కొలను మేకింగ్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ షాట్స్ కు సోషల్ మీడియాలో అంతగా గుర్తింపు రాలేదు. అదే కోలీవుడ్ డైరెక్టర్స్ లోకేష్ కనగరాజ్, నెల్సన్ కనుక ఈ షాట్స్ తీస్తే సూపర్ సూపర్ అంటూ ప్రశంసించేవారని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం ఎవడ్రా విక్రమ్.. మా సైంధవ్ ను చూడండి.. అంటూ చెప్పుకొస్తున్నారు. మరి జనవరి 13 న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version