Saindhav saiko name is named because of this says Sailesh Kolanu:‘సైంధవ్’ మేకర్స్ టీజర్‌ను లాంచ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని అన్ని ప్రధాన పాత్రలని ఇంతకుముందు రివీల్ చేయగా ఇప్పుడు టీజర్‌లో సినిమాలోని రెండు విభిన్న కోణాలు కనిపిస్తున్నాయి. ఇది ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తున్నా హీరో కారణంగా పూర్తికాని పెద్ద అసైన్‌మెంట్‌ను తీసుకునే భయంకరమైన విలన్‌గా నవాజుద్దీన్ సిద్ధిఖీని పరిచయం చేయడంతో సినిమా కోర్ పాయింట్ ఆసక్తికరంగా ప్రజెంట్ చేసినట్టే కనిపిస్తోంది. వెంకటేష్‌ను సైకో (SaiKo) అని పిలవడం హీరో హింసాత్మక స్వభావాన్ని సూచిస్తుండగా వెంకటేష్ ముందు ప్రశాంతంగా, భావోద్వేగంగా చివర్లో ఫెరోషియస్ గా కనిపిస్తారు. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ వెంకటేష్ ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలిపారు.
Siddu Jonnalagadda: తెలుసు కదా అంటున్న టిల్లు..ఈసారి కూడా రచ్చే!
వెంకటేష్ కి పెద్ద హిట్ ఇవ్వాలనే సంకల్పంతో పని చేశానని అంటూ నిర్మాత వెంకట్ కి కృతజ్ఞతలు తెలిపారు. సినిమాకు కావాల్సిన అన్నీ వెంకట్ సమకూర్చారని అంటూనే నవాజుద్దీన్ సిద్ధిఖీకి తెలుగు చిత్ర పరిశ్రమలోకి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. అందరం వెంకీమామకి పెద్ద హిట్ ఇవ్వాలని పని చేశామని ఈ టీజర్ లో చూసింది చిన్న గ్లింప్స్ మాత్రమే, సినిమాలో చాలా ఉందని అన్నారు. సినిమా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలవుతారని పేర్కొన్న ఆయన సంతోష్ నారాయణ్ బ్రిలియంట్ స్కోర్ చేశారని అన్నారు. సినిమాను థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తారని, నటీ నటులు, టెక్నికల్ టీం అందరికీ థాంక్స్ చెప్పారు. జనవరి 13న అందరూ థియేటర్స్ లో సినిమా చూద్దాం, వెంకీ మామ 75ని సెలబ్రేట్ చేసుకుందాం అన్నారు. అయితే సినిమాలో వెంకటేష్ కి సైకో అని పేరు పెట్టడానికి కారణం తన పేరే అని శైలేష్ కొలను దాన్నే షార్ట్ ఫారంగా సైకో అని పెట్టానని ఆయన అన్నారు.