Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. దసరా హిట్ తో జోరు పెంచేసిన నాని.. నాని 30 ను మొదలుపెట్టేశాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక ఈ సినిమా కాకుండా నాని హిట్ 3 లో నటిస్తున్న విషయం తెల్సిందే. హిట్ 2 చివర్లో నానిని చూపించి.. హిట్ 3 పై అంచనాలను పెంచేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇక వీరిద్దరి కాంబోలో ఇంకో సినిమా రాబోతుంది. అదే ‘సైంధవ్’. విక్టరీ వెంకటేష్, శ్రద్దా శ్రీనాధ్ జంటగా శైలేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో నాని కూడా ఉన్నట్లు శైలేష్ హింట్ ఇచ్చేశాడు. వెంకీ మామ, నాని మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతుందా ..? అంటే నిజమే అనిపిస్తుంది. అందుకు కారణం తాజాగా శైలేష్.. నాని 30 పోస్టర్ ను పోస్ట్ చేసి చెప్పిన డైలాగ్స్.
SS Karthikeya: మా అమ్మను పెళ్లి చేసుకోవడానికి ముందే రాజమౌళి మా ఇంటికి వచ్చి..
నాని 30 పోస్టర్ ను పోస్ట్ చేస్తూ.. శైలేష్.. ” ఆల్ ది బెస్ట్ నాని బ్రో.. అయితే ఈ క్రిస్టమస్ కు నీవి రెండు మూవీస్ వస్తున్నాయి. రెండు హిట్ లే” అని పోస్ట్ చేశాడు. ఇక దీనికి నాని సమాధానమిస్తూ .. ” హిట్టా..? నా రెండు బ్లాక్ బస్టర్స్ యే ఈ క్రిస్టమస్ కు.. అంటూ నాని30, సైంధవ్ సినిమాలను ట్యాగ్ చేశాడు. దీంతో వెంకీ సినిమాలో నాని ఉన్నాడు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే సైంధవ్ ను నిర్మిస్తుంది నిహారిక ఎంటర్ టైన్మెంట్స్. నాని కు హిట్ ఇచ్చిన శ్యామ్ సింగరాయ్ నిర్మాతలు. అందుకే నాని ఆ సినిమను కూడా తన సినిమా అని ఉండొచ్చు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే