NTV Telugu Site icon

SaiDharam Tej: సత్తా చాటుకున్న సాయిధరమ్ తేజ్!

Sai Dharam Tej 1

Sai Dharam Tej 1

SaiDharam Tej: మెగాస్టార్ మేనల్లుడైనా, ఏ స్టార్ అల్లుడైనా, కొడుకైనా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటే సరిపోదు. నిజంగా పస లేకుంటే, ఆ చెట్టు పేరు ఎంత చెప్పినా కాయలు అమ్ముడు పోవు. యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ మేనమామ చిరంజీవి నీడనే చిత్రసీమలో అడుగు పెట్టారు. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ పేరు నిలబెడుతూ, తన సత్తా చాటుకున్నారు సాయిధరమ్.

సాయిధరమ్ తేజ్ 1986 అక్టోబర్ 15న జన్మించారు. చిరంజీవి చెల్లెలు విజయదుర్గ పెద్దకొడుకు సాయిధరమ్ తేజ్. హైదరాబాద్ యూసఫ్ గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో డిగ్రీ చదివారు సాయిధరమ్. ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోయే. ఇద్దరిలోనూ సాయిధరమ్ ను చూస్తే మేనమామ చిరంజీవి పోలికలు మెండుగా కనిపిస్తాయి. చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో ఎలా ఉండేవారో అలా సాయిధరమ్ ఆయనను గుర్తుకు తెస్తారు.

Read Also: Munugode bypolls: మునుగోడులో భారీగా నామినేషన్లు.. ఒక్కరోజే వందకుపైగా నామినేషన్లు..

సాయిధరమ్ తేజ్ తొలుత వై.వి.ఎస్.చౌదరి రూపొందించిన ‘రేయ్’లో నటించినా, ఆ సినిమా కంటే ముందు ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం విడుదలయింది. ఈ సినిమాతోనే సాయిధరమ్ మంచి మార్కులు సంపాదించేశారు. ఏడు సంవత్సరాలలో 14 చిత్రాల్లో నటించేశారు. “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, నక్షత్రం, చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్” చిత్రాలు సాయిధరమ్ తేజ్ కు హీరోగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. సాయిధరమ్ తో ఇంతకు ముందు ‘సోలో బ్రతుకే సో బెటర్’ నిర్మించిన బి.వి.యస్.యన్. ప్రసాద్ తెరకెక్కిస్తున్న చిత్రంలో సాయిధరమ్ హీరోగా నటిస్తున్నారు. కార్తిక్ దండు ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

Read Also: Fact Check: అవునా? 4 జీ, 3 జీ మొబైల్స్ నిలిచిపోతాయా? నిజమెంత..?