NTV Telugu Site icon

Sai Sushanth Reddy: పెళ్లి పీటలు ఎక్కనున్న సుశాంత్.. ఎంగేజ్మెంట్ పిక్ వైరల్

Sushanth

Sushanth

Sai Sushanth Reddy: ఈ నగరానికి ఏమైంది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయినప్పుడు కన్నా.. రీరిలీజ్ అయ్యినప్పుడు మరింత హైప్ తెచ్చుకున్న ఈ సినిమాలో ప్రతి ఒక్క హీరో గురించి, వారి పాత్రల గురించి పూస గుచ్చినట్లు చెప్పుకొస్తారు అభిమానులు. ఇక అందులో మెయిన్ హీరోగా నటించిన సాయి సుశాంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత విశ్వక్ సేన్ వరుస సినిమాలు తీసి స్టార్ హీరోగా మారాడు. సుశాంత్ సైతం హీరోగా మంచి అవకాశాలను అందుకున్నా.. అంత స్టార్ డమ్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ఇక సుశాంత్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. నిన్న సుశాంత్ ఎంగేజ్ మెంట్.. గ్రాండ్ గా జరిగింది. తన నిశ్చితార్థపు ఫోటోలను సుశాంత్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ అభిమానులను ఆశీర్వదించమని కోరాడు. అయితే వధువు ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Rashmi Gautam: స్టుపిడ్ అంటూ రెచ్చిపోయిన నెటిజన్.. దిమ్మతిరిగేలా కౌంటరిచ్చిన రష్మీ

ఇక సుశాంత్ ది ప్రేమ పెళ్లి అని సమాచారం. ప్రేమించిన అమ్మాయిని కుటుంబానికి పరిచయం చేసి.. ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాకనే వీరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని టాక్. ఇక నిశ్చితార్థపు వేడుకలో సుశాంత్ ఎంతో అందంగా కనిపించాడు. ప్రేమించిన అమ్మాయికి రింగ్ తొడుగుతూ నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక అభిమానులు.. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరి పెళ్లి డేట్ ను ఖరారు చేయనున్నారు. మరి పెళ్లి తరువాత సుశాంత్ కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది.

Show comments