NTV Telugu Site icon

Sai Pallavi: ఆ ప్లాప్ సినిమాకు డబ్బులు వద్దని చెప్పాను.. కానీ

Sai Pallavi

Sai Pallavi

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పలు వాయిదాల తరువాత ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇక హీరోయిన్ సాయి పల్లవి పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఇక సినిమాల రెమ్యూనిరేషన్, డబ్బులు విషయాలను అన్ని అమ్మకు వదిలేసానని, అవన్నీ అమ్మ చూసుకుంటూనే నాకు బావుంటుందని అనిపించిందని తెలిపింది. “మేము అంత డబ్బు ఉన్నవాళ్లం అని చెప్పలేను కానీ డబ్బు విషయంలో ఇబ్బంది పడింది లేదు అని మాత్రం చెప్పగలం.. మాకు అవసరమైన ప్రతిదీ మా తల్లిదండ్రులు మాకు ఇచ్చారు. నేను సినిమాల్లోకి వచ్చాకా నాకు సంబంధించిన అన్ని విషయాలను అమ్మే చూసుకుంటుంది.

నా రెమ్యూనిరేషన్, ఫైనాన్షియల్ గా ఆమె ఉంది. డబ్బు విషయంలో అమ్మాయి కరెక్ట్ అని నాకు అనిపించింది. నేను ఇప్పటికీ ఏదైనా షాపింగ్ చేసినా ఓటీపీ అమ్మకే వెళ్తోంది. ఇక నా సినిమా ప్లాప్ అయితే నేను చాలా బాధపడతాను.. నాకు చెడ్డ పేరు వస్తుంది అని కాదు కానీ, నిర్మాతలు నష్టపోయారు అని బాధ పడతాను.. నేను నటించిన ‘పడిపడి లేచే మనసు’ ప్లాప్ అయ్యింది. అప్పటికే నాకు అడ్వాన్స్ ఇచ్చేశారు.. మిగతా డబ్బులు వద్దని అమ్మ చేత చెప్పించాను. కానీ నిర్మాత సుధాకర్ గారు.. ఒక్క రూపాయి కూడా వదలకుండా పంపించారు. ఇక నటిగా అవకాశాలు రాలేదని, నాకు ఒక అవకాశం ఇవ్వమని నేను అడగను.. అవకాశాలు లేకపోతే చక్కగా డాక్టర్ గా పని చేసుకుంటాను.. దానికి చదవాల్సి వస్తే చదువుతాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.