సాయి పల్లవి .. సాయి పల్లవి.. సాయి ప్లాలవి ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాటపర్వం’ రిలీజ్ కు సిద్దమవుతుంది.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలను ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
విరాట పర్వం నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కాబట్టి సినిమా గురించి చెప్తూనే పాక్ టెర్రరిస్టులు, కాశ్మీర్ ఫైల్స్ గోహత్యల గురించి కూడా ఫ్లో లో చెప్పుకుంటూ వెళ్ళిపోయింది ఈ సినిమాలో నక్సల్స్ యూనిఫార్మ్ వేసుకొని, గన్స్ పట్టుకొని అడివిలో తిరిగారు. ఈ సినిమా తరువాత వారిపై ఏమైనా సింపతీ వచ్చిందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం చెప్తూ “వాళ్లది ఒక ఐడియాలజీ..మనకు శాంతి అనేది ఒక ఐడియాలజీ. నాకు వయెలెన్స్ అనేది నచ్చదు.. తప్పుగా అనిపిస్తుంది. వయిలెంట్ గా వుండి మనం సాధించగలమని నేను నమ్మను. వాళ్ల టైమ్ లో ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలి. మా కష్టాలని ఎవరు వింటారు.. లా అనేది వుంటే ఇది కరెక్ట్ ఇది తప్పు అని చూడాలి. అని ఎవరికీ తెలియదు. ఎక్కడికి వెళ్లాలి.. ఏం చేయాలో తెలియదు. అందుకే వారంతా ఓ గ్రూపుగా మారారు. అయితే వాళ్లు చేసింది తప్పా రైటా అని చెప్పే పరిస్థితిలో లేము.. అది ఏదో కాలంలో జరిగింది.
కొంచెం ముందుకు వచ్చి చెప్తే.. పాకిస్తాన్ లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రిస్ట్ లలా కనిపిస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. మనం హార్మ్ చేస్తామనుకుంటారు కాబట్టి. మనకు వాళ్లు అలానే కనిపిస్తారు.చూసే విధానం మారిపోతుంది. నాకు వయలెన్స్ అనేది నచ్చదు. అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఏది తప్పు ఏది రూట్ అని చెప్పడం కష్టం. ఆ కాలంలో వాళ్లు ఉన్న పరిస్థితిలో వాళ్ళందరూ నమ్మారు. అలా చేస్తే నే మాకు న్యాయం దొరుకుతుందని అనుకున్నారు.ఇది చేస్తేనే మా పిల్లలకు, ఫ్యామిలీ మంచిది అని వారు అనుకోని చేసినది. మా ఫ్యామిలీ లెఫ్ట్ రైట్ అని ఉండదు. న్యూట్రల్ గా వుండే ఫ్యామిలీలో పెరిగాను. అందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పలేను. మనం మంచి మనుషుల్లా ఉండాలి. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారని మనం కూడా చేయకూడదు. బాధితుల గురించి ఆలోచించాలి.
ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అని చెప్పలేం.. కొన్ని రోజుల ముందు కూడా ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా వచ్చింది కదా? .. ఆ టైమ్ లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు కదా?.. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే.. రీసెంట్ గా ఓ బండిలో ఎవరో ఆవులని తీసుకెళ్తున్నారు. ఆ బండిని నడుపుతున్న వ్యక్తి ముస్లీంగా ఉన్నారు. వాటిని చూసి కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగినదానికి తేడా ఎక్కడ వుంది.. మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా వుంటే ఇతరులను బాధించం.. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం మంచిగా వుండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు.. మీరు న్యాయంగా ఉంటే అక్కడ న్యూట్రల్ గా ఉండగలరు’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎంత వైరల్ గా మారాయి అంటే ప్రస్తుతం ఈ టాపిక్ మీద వివాదం నడుస్తోంది. కొంతమంది సాయి పల్లవి అన్న మాటలను విమర్శిస్తున్నారు.. ఇక్కడ పుట్టి పాకిస్థాన్ చేసిన పని మంచిది అంటావా..? అని కొందరు అంటుంటే.. మరికొందరు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
