‘ఫిదా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి. ముఖంపై మొటిమలతో, తక్కువ మేకప్ తో కనిపించిన ఈ భామను అప్పట్లో ట్రోల్ల్స్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ అవేమి పట్టించుకోకుండా తన పంథాలోనే కొనసాగుతూ వచ్చిన సాయి పల్లవి తన న్యాచురల్ అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకొంది. ఇక స్కిన్ షో చేయను అని నిర్మోహమాటంగా చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో పెడుతూ ఎంతమంది తారలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఇక తాజాగా సాయి పల్లవి, నాని సరసన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటించింది అనడం కన్నా జీవించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు సాయి పల్లవి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. నిండైన తెలుగుతనం ఉట్టిపడేలా చీర కట్టుకొని హాజరయ్యింది. ఎరుపు రంగు బెనారస్ చీర.. దానికి తగ్గట్టు ఆభరణాలు పెట్టుకొని అచ్చ తెలుగింటి ఆడపడుచులా కనిపించింది. ప్రస్తుతం సాయి పల్లవి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోయి కామెంట్స్ తో రెచ్చిపోయారు. అందం, అభినయానికే కాదు నీ ఆహార్యానికి కూడా ఫిదా అయిపోయాం అని కొందరు .. ఇండస్ట్రీలో ఉండి కూడా నువ్వు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్న తీరుకు హ్యాట్సాఫ్ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.