NTV Telugu Site icon

Sai Pallavi : ఆ డాన్స్ తోనే సాయి పల్లవి స్కిన్ షో కి నో!

New Project (18)

New Project (18)

మలయాళీ భామ సాయి పల్లవి టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర ఉంటే తప్పకుండా దర్శకనిర్మాతలు సాయిపల్లవినే అప్రోచ్ అవుతుంటారు. దక్షిణాదిన సినిమాలలో స్కిన్ షో చేయకుండా సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఏకైక తార సాయిపల్లవే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఆమెకు వచ్చిన స్టార్‌డమ్ అంతా ఆమె పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ కారణంగానే వచ్చిందన్నమాట. ఇక సాయి పల్లవి స్కిన్ షోకి దూరంగా ఉండటానికి కారణం ఏమిటన్నది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియచేసింది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సాయిపల్లవి తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆమెకు ఓ చెల్లెలు. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత జరిగిన ఓ సంఘటన సాయిపల్లవిని ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంచిందట. జార్జియాలో విద్యాభ్యాసం చేసిన సాయిపల్లవి అక్కడ టాంగో డ్యాన్స్ నేర్చుకుంది. అయితే ఆ డాన్స్ చేసేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులు ధరించాలి. పేరంట్స్ అనుమతితో ఆ నృత్యాన్ని నేర్చుకుంది కూడా. అంతే కాదు అప్పట్లో టాంగో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆకాకిఅవలైనితో కలసి ప్రదర్శన కూడా ఇచ్చింది.

 

ఆ తర్వాత ‘ప్రేమమ్‌’ చిత్రంలో నటించే అవకాశం రావటం ఆ సినిమా విడుదలై సూపర్ హిట్ అవటం జరిగిపోయాయి. కానీ తను స్టార్ అయిన తర్వాత సాయిపల్లవి చేసిన టాంగో డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇక ఆ వీడియోపై నెటిజన్లు చేసిన ఘాటు కామెంట్స్ తనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగించాయట. అంతే అప్పటి కప్పుడు సినిమాల్లో ఎక్స్ పోజింగ్ అనిపించే కాస్ట్యూమ్స్ ని ధరించకూడదనే నిర్ణయం తీసుకుందట. సాయి పల్లవి గ్లామర్ ప్రదర్శనకు దూరంగా ఉండటానికి కారణం ఇదేనట. ప్రస్తుతం సాయిపల్లవి నటించిన ‘విరాట పర్వం’ ఈ నెల 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్లు చెబుతోంది. తనకు నచ్చిన సబ్జెక్ట్స్ అయితేనే సినిమాలు చేస్తానని కరాఖండిగా చెబుతోంది సాయిపల్లవి