NTV Telugu Site icon

Sai Pallavi: ప్లాప్ అవుతాయని తెలిసే సాయిపల్లవి రిజెక్ట్ చేసిందా.. ?

Sai Pallavi

Sai Pallavi

Sai Pallavi: ఫిదా మూవీతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే ఈ చిన్నది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక తన డ్యాన్స్ తో అభిమానుల గుండెల్లో క్వీన్ గా మారిపోయింది. గ్లామర్ పాత్రలకు నో చెప్తూ.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకొని ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక తన వ్యక్తిత్వంతో లేడీ పవర్ స్టార్ గా మారింది. సినిమాలో ఎంత స్టార్ క్యాస్టింగ్ అయినా ఉండని, ఎంత పెద్ద హీరో అయినా కానీ, తనకు కథ నచ్చకపోయినా.. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా వెంటన్ రిజెక్ట్ చేస్తుందట సాయిపల్లవి. ఇలా ఇప్పటివరకు ఆమె ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసింది. విచిత్రంగా ఆమె రిజెక్ట్ చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. ముఖ్యంగా సాయిపల్లవి రిజెక్ట్ చేసిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాలు అంటే.. డియర్ కామ్రేడ్, భోళా శంకర్, చంద్రముఖి 2, వలిమై.. ఇలా ఆపెద్ద లిస్టే ఉంది.

డియర్ కామ్రేడ్ లో రష్మిక పాత్రకు మొదట సాయిపల్లవిని అనుకున్నారట. అయితే అందులో రొమాన్స్ ఉండడం, విజయ్ తో పెదవి ముద్దులు ఉండడంతో ఆమె నో చెప్పిందని టాక్. ఇక భోళా శంకర్ లో చిరంజీవి చెల్లిగా మొదట సాయిపల్లవిని అనుకున్నారట. కానీ, అది అంత ఇంపాక్ట్ అనిపించేలా లేకపోవడంతో ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసిందని సమాచారం. ఇక ఆ పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఇక చంద్రముఖి 2 లో మొదట సాయిపల్లవి ని అనుకున్నారట. కానీ, అంతలోనే కంగనానే వచ్చి ఆ పాత్ర చేస్తానని చెప్పడంతో సాయిపల్లవి వరకు వెళ్ళలేదు. ఒకవేళ వెళ్లినా ఆమె ఈ పాత్ర ఒప్పుకునేది కాదు అనేది అభిమానులు మాట. ఇక ఇవే కాదు. వలిమై లో అజిత్ సరసన మాంజా వారియర్ పాత్రను, లియోలో త్రిష పాత్రకు సాయిపల్లవి ని సంప్రదించగా అవేమి అంత గొప్ప పాత్రలు కాకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసిందంట. ఇలా సాయిపల్లవి రిజెక్ట్ చేసిన ప్రతి సినిమా ప్లాప్ అవుతూనే వచ్చాయి. దీంతో ఆమె రిజెక్ట్ చేసాక ప్లాప్ అయ్యాయా.. ? ప్లాప్ అవుతాయని తెలిసే సాయిపల్లవి రిజెక్ట్ చేసిందా.. ? అనే అనుమానం వస్తుందని అనుకుంటున్నారు. ఏదిఏమైనా సాయిపల్లవి ఫ్యాన్స్ మాత్రం హమ్మయ్య.. ఆ సినిమాలు ఒప్పుకోలేదు సంతోషం అని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments