Sai Pallavi: ఆ క్రేజ్ ఏంటి మాస్టారూ?
- సాయి పల్లవి హీరోయిన్ గా అమరన్
- దీపావళి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు
- ప్రీ రిలీజ్ ఈవెంట్ లో షాకింగ్ గా మారిన సాయి పల్లవి క్రేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi: శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తాజా తమిళ చిత్రం అమరన్. ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. శ్రేష్ట్ సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ మొదలు కాకముందే సాయి పల్లవి అభిమానులు ఆ ఈవెంట్ ఆడిటోరియం మొత్తాన్ని ఆక్రమించారు. ఇక సాయి పల్లవి వచ్చినప్పటి నుంచి సాయి పల్లవి, సాయి పల్లవి అంటూ అరుస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు రాజకుమార్ పెరియ సామి వేదిక మీద మాట్లాడుతున్న సమయంలో సాయి పల్లవి ప్రస్తావన ఒకసారి వచ్చింది.
Also Read: Jani Master: జైలు నుంచి ఇంటికి.. జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
అంతే ఆ దర్శకుడిని మాట్లాడనివ్వకుండా దాదాపు రెండు నిమిషాల పాటు సాయి పల్లవి, సాయి పల్లవి అంటూ ఆమె అభిమానులు అరుస్తూనే ఉన్నారు. దర్శకుడు కూడా ఒకానొక సందర్భంలో షాక్ అయ్యాడు. ఇదేంటి సాయి పల్లవికి ఇంత క్రేజ్ ఉందేంటి అనేలా ఆయన యాంకర్ సుమ వంక చూశారు. ఇక ఆ తర్వాత మాట్లాడుతూ తనకు ఫోన్లో నెంబర్లు సేవ్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఒరిజినల్ పేర్లు కాకుండా నిక్ నేమ్స్ తో సేవ్ చేసుకోవడం అలవాటని అలా సాయి పల్లవిని రియాలిటీ విషయంలో డాన్స్ కంటెస్టెంట్ గా చూసినప్పుడు హీరోయిన్ అని పదహారేళ్ళ వయసులో సేవ్ చేసుకున్నానని ఈరోజు ఆమె ఇండియాలోనే టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిందని చెప్పుకొచ్చారు. ఇక సాయి పల్లవి కోసం అభిమానులు ఎంతగా అరుస్తూ గోల చేస్తూ ఉన్నారో వారందరినీ చూస్తే ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియాకి కూడా కాస్త షాకింగ్ గానే అనిపించింది. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అంటూ ఆడిటోరియం మొత్తాన్ని దద్దరిల్లేలా చేశారు ఆమె అభిమానులు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?