Site icon NTV Telugu

Sai Kumar: ‘అరి’ కోసం ప్రైడ్‌గా రాబోతున్న డైలాగ్ కింగ్!

Sai Kumar Pride Look

Sai Kumar Pride Look

Sai Kumar Pride Look From Ari Film Released: అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాకు పెట్టుకున్న బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్ అనే క్యాప్షన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఈ చిత్రాన్నిఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో డైలాగ్ కింగ్ సాయి కుమార్ పోషిస్తున్న ప్రైడ్ అనే క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను శనివారం మేకర్స్ రివీల్ చేశారు. దీనిని హీరో ఆదిసాయికుమార్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇదని పోస్టర్ లుక్ ద్వారా తెలుస్తోంది. మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపిస్తున్నామని దర్శకుడు జయశంకర్ తెలిపారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

Exit mobile version