NTV Telugu Site icon

Sai Tej : నిన్ను చూస్తే గర్వంగా ఉంది పెదమామ.. చిరంజీవిపై సాయిదుర్గతేజ్ ట్వీట్

Saitej

Saitej

Sai Tej : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఇప్పటికే ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఇప్పుడు లండన్ లోని యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో అక్కడ పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులు, ఇతర కీలక అధికారులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. అంతే కాకుండా బ్రిడ్జ్‌ ఇండియా సంస్థ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది. చిత్రసీమలో ఆయన చేసిన విశేష సేవలకు గాను ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారు. తన జీవిత ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు అందరికీ థాంక్స్ చెప్పారు. చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Read Also : Ananya Nagalla: మెట్రోపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. మేం చేస్తే తప్పేంటి?

ఇదే క్రమంలో మేనల్లుడు సాయిదుర్గాతేజ్ కూడా ట్వీట్ చేశాడు. ‘ నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది పెదమామ. బ్రిడ్జ్ ఇండియా నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మొదటి ఇండియన్ హీరోవి నువ్వే కావడం చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎప్పటికీ మాకు స్ఫూర్తిగానే నిలుస్తావు. నీ లాంటి వ్యక్తి మాకు ఉండటం అదృష్టం అంటూ రాసుకొచ్చాడు. దాంతో ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సాయితేజ్ సంబరాట ఏటిగట్టు సినిమాలో నటిస్తున్నాడు. ఇది భారీ ప్రాజెక్టుగా రాబోతున్న సంగతి తెలిసిందే.