Site icon NTV Telugu

Sai Durga Tej : నీ త్యాగాలు నాకు తెలుసు బాబాయ్.. మనోజ్ పై సాయిదుర్గా తేజ్ పోస్ట్

Sai Tej

Sai Tej

Sai Durga Tej : మంచు మనోజ్ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వస్తున్న భైరవం సినిమాలో కీలక పాత్రలో నటించారు. మనోజ్, సాయి శ్రీనివాస్, రోహిత్ నటించిన భైరవం మే 30న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మనోజ్ కు చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో హీరో సాయి దుర్గా తేజ్ కూడా స్పెషల్ పోస్ట్ పెట్టాడు. నిన్ను స్క్రీన్ మీద చూసేందుకు వెయిట్ చేస్తున్నా. ఇన్ని రోజులు పర్సనల్ కారణాలతో నువ్వు నటనకు దూరమయినందుకు చాలా కోపంగా ఉంది. కానీ ఇప్పుడు తెరమీదకు రాబోతున్నాయి.

Read Also : JR NTR : విజేతలకు కంగ్రాట్స్.. గద్దర్ అవార్డుల ప్రకటనపై ఎన్టీఆర్..

చాలా సంతోషంగా ఉంది. గజపతి పాత్ర నీ కెరీర్ లోనే బెస్ట్ అవుతుందని ఆశిస్తున్నాను. నువ్వు నాకు బాబాయ్ వి, కుటుంబ సభ్యుడికంటే ఎక్కువ. నీ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ గా ఉండాలి. నువ్వు ఎన్ని త్యాగాలు చేశావో నాకు తెలుసు. నీ నటనకు నేను అభిమానిని. నీ ఎనర్జీని మరోసారి చూడాలని ఉంది’ అంటూ పోస్టు పోట్టాడు సాయి దుర్గా తేజ్. ఇందులో మనోజ్ తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు.

భైరవం సినిమా తమిళ మూవీ మురుగన్ కు రీమేక్. తెలుగు వెర్షన్ కు తగ్గట్టు దాన్ని రూపొందించారు. ఏడేళ్ల తర్వాత ఈ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు మనోజ్. మొదటి నుంచి ఆయన ఈ సినిమాకు భారీగా ప్రమోషన్లు చేస్తున్నాడు. మూవీ ప్రమోషన్లతో భారీ హైప్ ను సంపాదించుకుంది.

Read Also : MLC Kavitha : మిస్టర్ కేటీఆర్ నాతో పెట్టుకోవద్దు… విరుచుకుపడ్డ కవిత..

Exit mobile version