NTV Telugu Site icon

Virupaksha: అల్లుడి సినిమాని ప్రమోట్ చేస్తున్న మామ…

Virupaksha

Virupaksha

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘విరూపాక్ష’. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, SVCC కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎలివేట్ చేశాడు. మంచి బజ్ క్రియేట్ చేసిన విరూపాక్ష గ్లిమ్ప్స్ నుంచి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ గేర్ మార్చి, మార్చ్ 1న విరూపాక్ష టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు.

విరూపాక్ష గ్లిమ్ప్స్ కి ఎన్టీఆర్ ని దించినట్లు, టీజర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని దించారు. అల్లుడి సినిమాని ప్రమోట్ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ ‘విరూపాక్ష’ సినిమా టీజర్ ని లాంచ్ చేశాడు. ఈ విషయన్ని తెలియజేస్తూ సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ టీజర్ ని లాంచ్ చేసిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్, కార్తీక్ దండు, భోగవల్లి ప్రసాద్ కూడా ఉన్నారు. ఈ ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని ‘గురూజీ’ అని సంబోధిస్తూ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ ట్వీట్ ని పోస్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్, విరూపాక్ష టీజర్ ని లాంచ్ చేసేసాడు కానీ ఆడియన్స్ ముందుకి మాత్రం మార్చ్ 1నే రానుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు కలిసి సముద్రఖని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. తమిళ సినిమా ‘వినోదయ సిత్తం’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.