Site icon NTV Telugu

Sai Dharam Tej : ఎట్టకేలకు బయటకొచ్చిన హీరో… గుడ్ న్యూస్ చెప్తూ స్పెషల్ వీడియో

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు ఓ స్పెషల్ వీడియో ద్వారా అభిమానుల ముందుకొచ్చాడు. అంతేకాదు మెగా అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్ కూడా తీసుకొచ్చాడు. గత ఏడాది సెప్టెంబర్ లో యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని మాదాపూర్ లో బైక్ స్కిడ్ అయ్యి, యాక్సిడెంట్ జరగగా, సాయి తేజ్ ను ముందుగా దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి, ఆ తరువాత అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొంతకాలం డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్న తేజ్ ను ఇంటికి తీసుకెళ్లి చికిత్స కొనసాగించారు. అప్పటి నుంచి అభిమానులకు అస్సలు కన్పించట్లేదు తేజ్. అప్పుడప్పుడూ ఆయన ఫోటోలు బయటకు వస్తున్నా, తేజ్ ను డైరెక్ట్ గా చూడాలని కోరుకున్నారు ఆయన ఫ్యాన్స్.

Read Also : RRR : అతనొక్కడే… మహేష్ బాబు రివ్యూ

ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెర పడింది. ఫోటోలు మాత్రమే విడుదల చేస్తుండడంతో వచ్చిన అనుమానాలు అన్నింటికీ చెక్ పెట్టేశారు తేజ్. తాజాగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలో అభిమానులకు, తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, ఇంకా కుటుంబ సభ్యులకు, పవన్, చిరులకు థ్యాంక్స్ చెప్పారు తేజ్. అంతేకాదు ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని, దానిని సుకుమార్, బాబీ నిర్మిస్తారని వెల్లడించారు. అయితే తేజ్ వీడియోలో ఇంకా నీరసంగానే కన్పిస్తుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

Exit mobile version