Site icon NTV Telugu

Sai Dharam Tej: బుర్రతక్కువ వెధవ అన్న అభిమాని.. ఇచ్చిపడేసిన తేజ్

Tej

Tej

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. విరూపాక్షతో భారీ హిట్ అందుకున్నాడు. ఇక ఇదే జోష్ మీద వరుస సినిమాలను లైన్లో పెట్టిన తేజ్.. ప్రస్తుతం గాంజా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సినిమాలతో పాటు తేజ్.. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాడు. ఇక నేటితో తేజ్.. ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్లు పూర్తవవుతుంది. పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతో తేజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో.. తనదైన నటనతో సుప్రీం హీరోగా మారాడు. ఇక ఈ నేపథ్యంలోనే తేజ్.. తన అభిమానులతో చిట్ చాట్ సెషన్ చేశాడు. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పుకొచ్చాడు. ఇక అందులో ఒక అభిమాని ఘాటుగా మాట్లాడడంతో తేజ్ తనదైన రిప్లై తో ఇచ్చిపడేశాడు.

Allu Arjun: ది పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్.. ది పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్

ఒక నెటిజన్ .. ఇప్పటివరకు మీరుచేసిన సినిమాలో మీకు బాగా సంతృప్తినిచ్చిన పాత్రలు ఏంటి అని అడగ్గా .. తేజ్.. ” చిత్ర లహర, రిపబ్లిక్.. ఈ రెండు పాత్రలు నాకు చాలా సంతృప్తిని ఇచ్చాయి” అని చెప్పుకొచ్చాడు. అందులో రిపబ్లిక్ స్పెల్లింగ్ అప్పు పడడంతో మరో అభిమాని.. కొద్దిగా ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ” అది రిలబ్లిక్ కాదురా రిపబ్లిక్.. బుర్ర తక్కువ వెధవ.. ఎప్పుడైనా స్కూల్ కి వెళ్ళావా.. ?” అని రాసుకొచ్చాడు. దానికి తేజ్ సమాధానం చెప్తూ.. “నువ్వు చెప్పింది కరెక్ట్. మా స్కూల్లో గౌరవం కూడా నేర్పించారు.. నీకు నేర్పించారా మీ స్కూల్లో ? లేకపోతే నేర్చుకో” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దానికి సదురు అభిమాని.. రిప్లై ఇవ్వవు అని అలా పెట్టా.. క్షమించు అన్నా అంటూ చెప్పుకొచ్చాడు.

Exit mobile version