Sai Dharam Tej Speech BRO Movie BlockBuster Press Meet: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి నటించిన మూవీ ‘బ్రో’. జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషించగా ఎస్.థమన్ సంగీతం సమకూర్చారు. జూలై 28న విడుదలై విశేష ఆదరణ పొందుతోన్న క్రమంలో సినిమా యూనిట్ విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. ఈ క్రమంలో హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “జీ స్టూడియోస్ తో కలిసి ఇది నాకు మూడో సినిమా, చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమాలో మావయ్య పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కృతఙ్ఞతలు తెలిపిన ఆయన సముద్రఖని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అని, ఆయన తన ప్రయాణాన్ని చిన్నగా మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారని అన్నారు.
సామజవరగమన సినిమాలో నరేష్ టీషర్టుల మీద ఈ కొటేషన్స్ చూస్తే నవ్వాపుకోలేరు
ముందు ముందు మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్న ఆయన థమన్ నేపథ్య సంగీతంతో కట్టిపడేసాడని అన్నారు. కళ్యాణ్ మావయ్య గురించి, త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదని, త్రివిక్రమ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. త్రివిక్రమ్ గారు నన్ను నమ్మి, నేను పూర్తిగా కోలుకునే వరకు సముద్రఖని గారిని వెయిట్ చేయించారని, బ్రో చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులు అందరికీ కృతఙ్ఞతలు” అని అన్నారు. హీరోయిన్ కేతిక శర్మ మాట్లాడుతూ ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను, ఇంతమంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన త్రివిక్రమ్ గారికి, దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉందని, సాయి ధరమ్ తేజ్ లవ్లీ కో స్టార్. థమన్ గారి సంగీతం ఎంతగానో ఆకట్టుకుందని, మా సినిమాకి ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు అని అన్నారు.