Sai Dharam Tej Speech At Ranga Ranga Vaibhavanga Pre Release Event: రంగ రంగ వైభవంగా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఈ సందర్భంగా తన బైక్ ప్రమాదం సంఘటనను గుర్తు చేసుకున్నాడు. మళ్లీ తాను ఇలా స్టేజ్‌పైకి వస్తానని అనుకోలేదని, తాను ఆ ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్ ధరించడం వల్లే బతికానని, మీరు కూడా బైక్‌పై వెళ్లేటప్పుడు కచ్ఛితంగా హెల్మెట్ ధరించండని అభిమానుల్ని కోరాడు. ఇక ‘రంగ రంగ వైభవంగా’ సినిమా హిట్ అవుతుందా? బ్లాక్‌బస్టర్ అవుతుందా? అనే సంగతుల్ని పక్కన పెట్టేస్తే.. తన సోదరుడు వైష్ణవ్ తేజ్‌ను మీరు (ప్రేక్షకుల్ని ఉద్దేశిస్తూ) హీరోగా యాక్సెప్ట్ చేశారని, అదే తన బిగ్గెస్ట్ సక్సెస్ అంటూ తేజ్ ఎమోషనల్ అయ్యాడు.
‘‘వైష్ణవ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ మంచి విజయం సాధించడంతో మేమెంతో ఆనందపడ్డాం. రోజులంతా హ్యాపీగా గడిచిపోతున్నాయి. కానీ, ఇంతలో విధి రాసిన రాతలో భాగంగా నా రిపబ్లిక్ సినిమా రిలీజ్‌కి ముందు సెప్టెంబర్ 10వ తేదీన బైక్ ప్రమాదం జరిగింది. నేను ఆసుపత్రిలో పడుకొని ఉన్నప్పుడు నా తమ్ముడొచ్చి ‘అన్నా..’ అని పిలిస్తే పలకలేకపోయాను. ఆ సమయంలో నా పక్కన అమ్మ, నాన్న, నా తమ్ముడు ఉన్నారు. అప్పుడు అందరం కలిసుంటే ఎంత బాగుంటుందన్న విషయం నాకు అర్థమైంది. తమ్ముడు నా పక్కనుంటే నాకు ధైర్యం.. వీడే నా బలం’’ అంటూ సాయి తేజ్ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 2వ తేదీన విడుదల అవుతోన్న తన తమ్ముడి సినిమాని థియేటర్లకు వెళ్లి చూడమని అతను కోరాడు. అంతేకాదు.. ఆరోజు మరో పెద్ద పండుగ కూడా ఉందని పవన్ కళ్యాణ్ బర్త్‌డేని ఉద్దేశించి చెప్పాడు. ‘మీకు (ఫ్యాన్స్) ఆయన పవర్ స్టార్ అయితే, తనకు మాత్రం గురువు అని.. రంగ రంగ వైభవంగా సినిమాని చూసి, పవన్ పుట్టినరోజుని జరుపుకోండని సాయి ధరమ్ తేజ్ అన్నాడు.