Sai Dharam Tej Seeks blessings from Arasavalli suryanarayana swamy: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ సందడి చేశారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ తాను చేసిన బ్రో సినిమా గురించి మాట్లాడారు. 28న బ్రో రిలీజ్ అవుతుందని , నేను మా గురువు గారు కలిసి సినిమా చేస్తున్నాం అంటూ తన మేనమామ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి వెల్లడించారు. ఇక బ్రో సినిమా మీద ఆడియన్స్ పెట్టుకున్న ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవుతామని పేర్కొన్న ఆయన ఫ్యాన్స్ అనుకున్నదాని కంటే బ్రో సినిమా ఎక్కువ బాగుంటుందని అన్నారు. ఇక ప్రస్తుతానికి బ్రో సినిమా గూర్చి మాత్రమే ఆలోచిస్తున్నానని పేర్కొన్న ఆయన తన హెల్త్ గురించి స్వామిని వేడుకున్నానని అన్నారు. ఇక 2014 లో అరసవల్లి దేవాలయానికి వచ్చానని పేర్కొన్న ఆయన అప్పుడూ ఇప్పుడూ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం మంచిగా జరిగిందని అన్నారు.
MLC Kavitha: ఎంపీ అరవింద్ కు 24గంటలు టైం.. లేదంటే ముక్కు నేలకు రాయాలి కవిత సవాల్..
అందరూ బాగుండాలని కోరుకున్నానని ఆయన కామెంట్ చేశారు. ఇక తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సిత్తం అనే సినిమాని తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో సినిమాని డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులో కూడా సినిమాని డైరెక్ట్ చేస్తుండగా త్రివిక్రమ్ మాత్రం కథనం అలాగే డైలాగ్స్ అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్, వివేక కూచిభట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మీద తెలుగు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే పవన్ అభిమానులు మాత్రం సినిమా విడుదలకు ఇంకా వారం రోజులే ఉన్నా సినిమా మీద ఎందుకు హైప్ క్రియేట్ చేయడం లేదని అసంతృప్తితో ఉన్నారు