నందమూరి బాలకృష్ణని తెలుగు వాళ్లకి కొత్తగా పరిచయం చేసింది ‘అన్ స్టాపబుల్’ టాక్ షో. అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ నుంచి బయటకి వచ్చిన ఈ టాక్ షో, ‘ఆహా’కి ఎంత హెల్ప్ అయ్యిందో బాలయ్యకి కూడా అంతే హెల్ప్ అయ్యింది. ఈ షో వల్ల బాలయ్య అంటే ఏంటో చాలా మంది తెలుసుకున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 ఎండింగ్ కి వచ్చింది. ఈ లాస్ట్ ఎపిసోడ్ ని ‘బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్’గా ప్రమోట్ చేస్తున్న ఆహా అండ్ టీం , సీజన్ 2 ఎండింగ్ కి పవన్ కళ్యాణ్ ని రంగం లోకి దించారు. పవన్ కళ్యాణ్, బాలయ్యలు కలిసి కనిపించడమే అరుదైన విషయం. అలాంటిది ఇద్దరు కలిసి ఒకే వేదికపై గంటపాటు సరదాగా మాట్లాడుకోబోతున్నారు అంటే చిన్న విషయం కాదు. మెగా నందమూరి అభిమానులకి మాత్రమే కాకుండా మొత్తం తెలుగు ప్రేక్షకులకి కిక్ ఇచ్చే ఈ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కానుంది.
ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్న ఆహా టీం, ఇటివలే ఒక ఈ క్రేజీ ఎపిసోడ్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన తక్కువ సమయంలోనే టీజర్ ట్రెండ్ క్రియేట్ చేసింది అంటే బాలయ్య-పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ కోసం వ్యూవర్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ లో ఫాన్స్ కి మరింత కిక్ ఇస్తూ, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ తన మేనల్లుల గురించి మాట్లాడే సమయంలో, సాయి ధరమ్ తేజ్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పిన సమయంలో తేజ్ ని స్టేజ్ పైకి తీసుకోని వచ్చినట్లు సమాచారం. బైక్ యాక్సిడెంట్ తర్వాత బయట పెద్దగా కనిపించిన సుప్రీమ్ హీరో, ఇటివలే వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు కానీ షోకి రావడం ఇదే మొదటిసారి. సాయి ధరమ్ తేజ్ కి బాలయ్యకి కూడా చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. మరి బాలయ్యతో కలిసి ఈ మెగా మామ-అల్లుడు చేసే సందడి ఎలాంటిదో చూడాలి.
