Site icon NTV Telugu

సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్: హుటాహుటిన ఆస్పత్రి చేరుకున్న పవన్ కళ్యాణ్

ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్ అవటంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లారు. బైక్ కంట్రోల్ అవ్వక అదుపుతప్పి పడినట్లు తెలుస్తుంది. కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం సాయితేజ్ స్పృహలోకి వచ్చారు.
సాయిధరమ్ తేజ్ కు ఆక్సిడెంట్ అయిందని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన ఆస్పత్రి చేరుకున్నారు.. సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగిన తెలుసుకుంటున్నారు. అయితే ప్రాథమిక స్కానింగులు చేసిన డాక్టర్లు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన్ను మరో ఆసుపత్రికి తరలించే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version