NTV Telugu Site icon

Sai Dharam Tej: అభిమానులకి ఏదైనా జరిగితే మేము తట్టుకోలేం!

Sai Dharam Tej

Sai Dharam Tej

Sai Dharam Tej Comments at BRO Movie Trailer Launch: పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాను తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మించింది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్ సహా మై డియర్ మార్కండేయ, జానవులే పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ ను ఒకేసారి రెండు చోట్ల ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహిస్తూ విడుదల చేశారు. జాగ్ లోని జగదాంబ థియేటర్‌ లో, హైదరాబాద్‌లోని దేవి థియేటర్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమాలు నిర్వహింగా విశాఖలో సాయి ధరమ్ తేజ్, టీజీ విశ్వ ప్రసాద్‌, హైదరాబాదులో కేతిక శర్మ, సముద్రఖని, ఎస్ థమన్ తదితరులు పాల్గొన్నారు.

Prathinidhi 2: బాబు కోసం రంగంలోకి నారా రోహిత్.. ఎలక్షన్సే టార్గెటా?

ఈ క్రమంలో వైజాగ్ జగదాంబ థియేటర్‌ లో జరిగిన వేడుకలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “మీ ప్రేమ పొందడం కోసమే ఇంత దూరం వచ్చాను, మీ అందరికీ ట్రైలర్ నచ్చడం సంతోషంగా ఉంది. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అభిమానులకి ఏదైనా జరిగితే మేము తట్టుకోలేము అని అన్నారు. అలాగే “నాకు కొంచెం తిక్కుంది” అంటూ తన మేనమామ పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపారు సాయి ధరమ్ తేజ్. ఇక నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ మాట్లాడుతూట్రైలర్ మిమ్మల్ని ఎంతగా అలరించిందో, దానికి వంద రెట్లు సినిమా అలరిస్తుందని అన్నారు. హైదరాబాద్‌ దేవి థియేటర్‌ లో జరిగిన వేడుకలో ఈ సినిమా కోసం అందరిలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి ఆనందించదగ్గ సినిమా అని కేతిక శర్మ అన్నారు. ఇక ట్రైలర్ కేవలం శాంపిల్ మాత్రమే అని, సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయని, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని సంగీత దర్శకుడు థమన్ కామెంట్ చేశారు.

Show comments