NTV Telugu Site icon

Sai Dharam Tej: రెండేళ్లు అనుభవించిన నరకానికి దక్కిన ఫలితం.. ఈ విజయం

Tej

Tej

Sai Dharam Tej: ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అని సిరివెన్నలే సీతారామశాస్త్రి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిలో ఎంతో ధైర్యాన్ని నింపుతాయి. ఆ ధైర్యంతోనే మెగా మేనల్లుడు ముందు అడుగు వేసి.. విజయాన్ని అందుకున్నాడు. రెండేళ్ల క్రితం పెద్ద ప్రమాదం.. ఒంటినిండా గాయాలు.. అంతకన్నా ఎక్కువ మనసుకు తగిలిన గాయం, నోటి మాట పడిపోయింది. విమర్శలు, అవమానాలు.. వీటన్నింటిని తట్టుకొని నిలబడ్డాడు మెగా మేనల్లుడు. తన తప్పు తాను తెలుసుకున్నాడు. ప్రమాదం తరువాత మరో మనిషిగా జన్మనెత్తాడు. ఆరునెలలు పట్టిందట తేజ్.. ఒక మాటను కూడబలుక్కొని మాట్లాడడానికి. అయినా సరే దైర్యంగా విరూపాక్ష సెట్ లో అడుగుపెట్టాడు. తనవలన సినిమా ఆగిపోకూడదు.. అని రిస్క్ చేసి విరూపాక్ష షూటింగ్ పూర్తి చేశాడు. ఇక సినిమా పూర్తి అయ్యింది.. తన పని అయిపోయింది. రెస్ట్ తీసుకోవచ్చులే అని అనుకోలేదు. కష్టమైనా ప్రమోషన్స్ అన్ని తన ఒక్కడే భుజాన వేసుకొని చేశాడు.

వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్, టూర్స్ తో అభిమానుల మనసులను గెలిచాడు. సినిమా విషయాలతో పాటు.. తాను ఈ రెండేళ్లు ఎంతటి నరకాన్ని అనుభవించాడో కళ్ళకు కట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆ నరకానికి ఫలితం దక్కింది. నేడు వవిరూపాక్ష రిలీజ్ అయ్యి.. మఞ్చజి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ప్రతి ఒక్కరు సినిమా బావుందని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్ , హర్రర్ ఎలిమెంట్స్ బావున్నాయని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ విజయం.. ఖచ్చితంగా తేజ్ దే అని చెప్పాలి. ఇక ఆ ఆనందం తేజ్ కళ్ళలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. థియేటర్ నుంచి బయటికి రాగానే డైరెక్టర్ కార్తీక్ ను హత్తుకొని తేజ్ కంటనీరు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పాజిటివ్ టాక్ తోపాటు కలెక్షన్స్ కూడా రాబడితే.. ఈ ఏప్రిల్ విరూపాక్షదే అవుతుంది.

Show comments