NTV Telugu Site icon

Sai Dharam Tej: ఏం మెగా మేనల్లుడు గారు.. చిన్న మామపై సెటైర్ వేస్తున్నారు

Tej

Tej

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో మంచి హిట్ అందుకొని జోష్ మీద ఉన్నాడు. రెండేళ్ల తరువాత గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ నే అందుకున్నాడు. విరూపాక్ష మంచి టాక్ తో పాటు మంచి కలక్షన్స్ కూడా అందుకొని తేజ్ కెరీర్ లోనే గుర్తుండిపోతోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ జోష్ లోనే తనకు ఇంత మంచి హిట్ ఇచ్చిన అభిమానులకు థాంక్స్ చెప్పడానికి ట్విట్టర్ లో చిట్ చాట్ సెషన్ ను మొదలుపెట్టేశాడు. అభిమానుల సందేహాలను, సలహాలను #AskSDT అంటూ అడగొచ్చని చెప్పడంతో.. మెగా అభిమానులు తమ డౌట్స్ తో తయారయ్యిపోయారు. ఇక ఇందులో అభిమానులుతేజ్ మామల గురించి అడిగేశారు. ” మీరు బ్రతికారని తెలియగానే చిరంజీవి గారు కళ్ళలో మీరు చూసిన ఫీలింగ్ ఏంటి చెప్పండి” అని అడుగగా.. ” కొన్ని కొన్ని అనుభవించాలి అంతే.. చెప్పలేం” అంటూ చెప్పుకొచ్చాడు.

Ram Gopal Varma: బిగ్ బ్రేకింగ్.. వర్మ కొత్త ఛానెల్.. వివేకా మర్డర్ కేసు స్పెషల్

ఇక పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న వినోదాయ సీతాం రీమేక్ సినిమా టైటిల్ లీక్ చేయొచ్చుగా అన్నా అని అడిగిన అభిమానికి తేజ్ ” నీకు ఏం పోయింది.. అప్పుడు నాకే మళ్లీ ‘తేజు గారు’ అనే ఫోన్ కాల్ వస్తుంది” అని చెప్పుకొచ్చాడు. తేజుగారు అనిప్రత్యేకంగా ఎందుకు చెప్పాడో చెప్పాల్సిన అవసరం లేదు. విరూపాక్ష సినిమా హిట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్.. తేజ్ కు బొకే పంపుతూ తేజు గారు.. కంగ్రాట్స్ అని రాసి పంపిన విషయం తెల్సిందే. మేనల్లుడును గారు అని పిలవడం ఎందుకు పవన్ అంటూ అభిమానులు కూడా కామెంట్స్ చేశారు. ఇక ఆ వర్డ్ ను మళ్లీ రీపీట్ చేసి తేజ్ చిన్న మామపై సెటైర్ వేసావా..? లేక ఇమిటేట్ చేశావా..? అంటూ అభిమానులు సరదాగా ఆటపట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిట్ చాట్ సెషన్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments