13 Movies Releasing this week in tolywood: ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ లేకున్నా పలు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఏకంగా ఈ అక్టోబర్ 13న 13 సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఆ సినిమాల మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం.. రాక్షస కావ్యం సినిమా అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన నటించిన ఈ సినిమా దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. శ్రీమాన్ కీర్తి డైరెక్షన్లో ఈ సినిమా మంచి బజ్ తెచ్చుకుంది. పి.వి.ఆర్ట్స్ బ్యానర్ పై వెంకట్ పులగం నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో “మిస్టరీ” అనే సినిమా తెరకెక్కింది. తనికెళ్ల భరణి, అలీ, సుమన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సాయికృష్ణ,స్వప్న చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తుండగా అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా ‘కత్తి’ ఫేమ్ మల్లి దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించిన ‘మధురపూడి గ్రామం అనే నేను’ సినిమా కూడా అక్టోబర్ 13న సినిమా విడుదల కానుంది.
NTR AI Pics: దాదాసాహెబ్ ఫాల్కేగా జూ.ఎన్టీఆర్.. ఆహా !! ఆ ఊహే ఎంత బాగుందో!
రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న ‘తికమక తాండ’ సినిమాతో ఎన్నో చిత్రాల్లో బాల నటిగా అలరించిన ఆని హీరోయిన్ గా పరిచయమవుతోంది. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాతగా ఈ సినిమాను వెంకట్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కూడా అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. మార్త క్రియేషన్స్ బ్యానర్ ఫై ఓం ప్రకాష్ మార్త నిర్మాణ దర్శకత్వంలో గుణసుందరి కథ తెరకెక్కగా సునీత సద్గురు, ఆనంద చక్రపాణి, రేవంత్ త్రిలోక్, కార్తీక్ సాహస్, ఉదయ్ భాస్కర్, నరేంద్ర రవి, లలితా రాజ్,అక్షయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. విషికా లక్ష్మణ్, రవితేజ మహాదాస్యం జంటగా నటించిన సగిలేటి కథ సినిమాను నవదీప్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. అలాగే ద్రోహి, మా ఊరి రెయిన్ మేకర్, నీతోనే నేను అనే సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండగా రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. జయం రవి హీరోగా గాడ్, అలాగే పెళ్ళెప్పుడు అనే ,మరో డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. మరోపక్క ప్రేమ విమానం సినిమా జే5లో నేరుగా రిలీజ్ అవుతోంది.