Sabari Producer Mahendra Nath Kondla Interview: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకుడిగా సినిమాను తెరకెక్కించారు. సినిమా విడుదల దగ్గర పడడంతో నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. గుంటూరులో పుట్టి పెరిజి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లా, కొన్నేళ్లు అక్కడ పని చేసి కన్సల్టెన్సీలు, వ్యాపారాలు మొదలుపెట్టా. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా నేను ఎక్కడ ఉన్నప్పటికీ… చిన్నతనం నుంచి సినిమా అంటే ఆసక్తి, అందుకని, ఇండస్ట్రీలోకి వచ్చానని అన్నారు. ‘శబరి’ సినిమా చేయడానికి ప్రధాన కారణం వరలక్ష్మీ శరత్ కుమార్. నేను తొలి సినిమా ఏది చేయాలని ఆలోచిస్తున్న సమయంలో మా దర్శకుడు నాకు ఈ కథ చెప్పగా బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశా. అప్పటికే ఈ కథ వరలక్ష్మీ శరత్ కుమార్ విన్నారు, ఆవిడ ఓకే చేశారంటే 50 పర్సెంట్ నేను సేఫ్ అని ‘శబరి’కి ఓకే చెప్పా. వరలక్ష్మీ శరత్ కుమార్ తో సినిమా జర్నీ వండర్ ఫుల్. ఆవిడ మంచి ఆర్టిస్ట్. నిర్మాతలకు ఆవిడ చేసే మేలు చాలా మందికి తెలియదు.
KGF 3: కేజీఎఫ్-3 ఇక్కడే .. కొత్త అర్థం చెప్పిన చంద్రబాబు!
దీనికి ఖర్చు చేయమని ఆవిడ ఎప్పుడూ అడగలేదు, బడ్జెట్ పెంచే వ్యవహారాలు ఎప్పుడూ చేయలేదు. ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారని, వద్దని చెప్పేవారు. ఆవిడతో ఎంత మంచి రిలేషన్ షిప్ ఉందంటే… ‘మీకు మరో సినిమా చేస్తాను. మనం చేద్దాం’ అని చెప్పారు. సినిమాలో మదర్ అండ్ డాటర్ ఎమోషన్, సెంటిమెంట్ ఉంటుంది. అది ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. ఎంత బాగా చెప్పగలిగితే అంత బాగా జనాల్లోకి వెళుతుంది. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను తీసుకుని సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసి ఎమోషన్స్ డిఫరెంట్ వేలో చెప్పాం. మొదటి సినిమా ఐదు భాషల్లో చేయడం కొంచెం రిస్క్ అనిపించింది. అయితే, మొదటి నుంచి నా నేచర్ కొంచెం రిస్క్ తీసుకునే నేచర్, అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరిన వారానికి వ్యాపారం స్టార్ట్ చేశా. నో రిస్క్ నో గెయిన్ అంటారు కదా! రిస్క్ తీసుకుంటే జీవితంలో పైకి వస్తామని నమ్ముతా, సినిమాల్లోకి వచ్చినప్పుడు ఐదు భాషల్లో చేద్దామంటే ఓకే చెప్పా. కన్నడ, మలయాళ, తమిళ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడటం నాకు కొత్త. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా బాగా చేస్తున్నా అన్నారు.