Site icon NTV Telugu

హీరోగా నటించబోతున్న పవన్ భక్తుడు!

ప్రముఖ నిర్మాత, పవన్ భక్తుడు బండ్లగణేష్ హాస్యనటుడిగా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు పొందాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో చివరిగా నటించిన బండ్ల.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా, ఇదివరకే ఆయన హీరోగా మారబోతున్నట్లు వార్తలు వచ్చిన బండ్ల ఖండించారు. అయితే తాజాగా బండ్ల.. వెంకట్ అనే కొత్త దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వినోదభరితంగా సాగే ఈ కథలో, ప్రధాన పాత్రను బండ్ల గణేశ్ చేయబోతున్నాడట. నిర్మాతగా, హాస్యనటుడిగా రాణించిన బండ్ల.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడో, లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!

Exit mobile version