Site icon NTV Telugu

SPARK : మెహ్రీన్ తో పాటు రుక్సార్‌ ధిల్లాన్‌!

Saprk Life

Saprk Life

Ruksar Dhillon along with Mehreen!

విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఈ సినిమాలో చార్మింగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మరో హీరోయిన్ కు ఈ సినిమాలో స్థానం ఉండటంతో రుక్సార్ ధిల్లాన్ ను ఎంపిక చేశారు. విశ్వక్‌సేన్‌తో ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ మూవీ తర్వాత రుక్సార్‌ సైన్‌ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇటీవల ‘స్పార్క్’ మూవీని లావిష్‌ ఈవెంట్‌ తో ప్రారంభించారు మేకర్స్. ‘హృదయమ్‌’ ఫేమ్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ సినిమాకు ట్యూన్స్ అందిస్తున్నారు. అరవింద్‌ కుమార్‌ రవి వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవివర్మ ఇంతకు మునుపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. సో…. సినిమాటోగ్రఫీని కూడా అతనే హ్యాండిల్‌ చేస్తున్నారు. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘స్పార్క్’ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో విక్రాంత్‌ తో పాటు ‘వెన్నెల’ కిశోర్‌, సత్య, శ్రీకాంత్‌, కిరణ్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version