NTV Telugu Site icon

Rukmini Vasanth: టాలీవుడ్ లో గట్టిగా వినిపించే పేరు అవుతుంది..

Rukmini

Rukmini

Rukmini Vasanth: సినిమా పరిశ్రమ.. ఎంత ఎత్తుకు తీసుకెళుతుందో.. అంతే ఎత్తు నుంచి పడేయగలదు. సాధారణంగా.. ఏ రంగంలో రాణించినా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అని పెద్దలు చెప్తారు. వాటితో పాటు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. ఇక చిత్ర పరిశ్రమలో నటీనటులు.. ముఖ్యంగా నటీమణులు.. చాలా అంటే చాలా ముందు జాగ్రత్తతో ఉండాలి. అలా లేకపోతే ఒక హిట్ వచ్చాకా.. కనీసం కంటికి కూడా కనిపించకుండా పోతారు. ప్రస్తుతం చాలామంది హీరోయిన్ల పరిస్థితి ఇలానే ఉంది. మొదటి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి.. అభిమానుల మనసులో స్టార్ హీరోయిన్స్ గా మారారు. అయితే.. ఆ హిట్ సినిమా తరువాత.. వరుస సినిమాలు చేయాలనే ఆశపడ్డారు కానీ, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకోలేదు. అందుకే ఆ హీరోయిన్లు మొదటి సినిమా హిట్ మీదనే ఇంకా బతుకుతున్నారు. ఇక ముందు ముందు వచ్చే హీరోయిన్లకు కూడా అభిమానులు ఇదే చెప్పుకొస్తున్నారు. మొదటి సినిమా హిట్ అయ్యాకా అందరి చూపు వారి మీదే ఉంటుంది కాబట్టి ఎంచుకొనే సినిమాలను మంచిగా ఎంచుకుంటే నాలుగు కాలాలు హీరోయిన్ గా ఇండస్ట్రీలను ఏలతారు అని చెప్పుకొస్తున్నారు.

Boney Kapoor: శ్రీదేవిది సహజ మరణం కాదు.. ఎట్టకేలకు నోరు విప్పిన బోనీ..

అసలు ఇదంతా ఎందుకు అంటే.. ఈ మధ్యనే టాలీవుడ్ కు మరో కన్నడ బ్యూటీ పరిచయమైంది. రుక్మిణీ వసంత్.. పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. సప్తసాగరాలు దాటి అనే కన్నడ డబ్బింగ్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణీనే హైలైట్ గా నిలిచింది. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఆమె అందం.. తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది. ఒక్క సినిమా.. ఆ ఒక్క సినిమాతో ఈ భామ కుర్రాళ్ళ గుండెల్లో క్రష్ గా మారిపోయింది. దీంతో ముందు ముందు ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కడతాయి అని చెప్పుకొస్తున్నారు. టాలీవుడ్ లో గట్టిగా వినిపించే పేరు అవుతుంది.. అని జోస్యం చెప్పేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం.. అవకాశాలు వచ్చాయి కదా అని ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులు వెయ్యి అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి ఈ భామ కెరీర్ ఎలా సాగుతుందో చూడాలంటే.. తన నెక్స్ట్ సినిమా ఏ హీరోతో ఉంటుందో చూడాలి.

Show comments