Site icon NTV Telugu

Rukmini Vasanth : నా కల నిజమైంది.. కాంతారాతో ఎమోషనల్ అయిన రుక్మిణి వసంత్

Rukmini Kanthara

Rukmini Kanthara

కన్నడ సొగసరి రుక్మిణి వసంత్‌కు కెరీర్‌లో పెద్ద బ్రేక్ రావడానికి కొంత సమయం పట్టింది. అయితే రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘సప్త సాగరాలు దాటి’ సినిమా ఆమె సినీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ చిత్రంలో ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు, ఆ తర్వాత వరుస అవకాశాలకు బాటలు వేసాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే.

Also Read : Kangana : రక్తంతో నిండిన బెడ్‌షీట్ చూసి భయపడ్డా..

ఇందులో ముఖ్యంగా ‘కాంతార చాప్టర్-1’ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమాలో రుక్మిణి కనకావతి అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ మంచి హంగామా సృష్టించింది. అయితే  తాజాగా ఓ  ఇంటర్వ్యూలో రుక్మిణి మాట్లాడుతూ.. “రిషబ్‌ శెట్టి సర్ నన్ను సినిమా కోసం సంప్రదించినప్పుడు, నిజంగా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నా కల నిజమైనట్టే అనిపించింది. ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించబోతుంది. చిత్రబృందం కోరుకున్నందువల్ల ఇప్పటివరకు నా పాత్ర గురించి ఎక్కడా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ లుక్ రాగానే అందరికీ తెలిసిపోయింది” అని చెప్పుకొచ్చారు. ప్రజంట్ ఈ అమ్మడు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లలో ఎన్టీఆర్ సరసన ‘డ్రాగన్’ ఒక్కటి, తమిళంలో ‘మదరాసి’, కన్నడంలో యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ ఈ వరుస ప్రాజెక్టులు చూస్తుంటే, రుక్మిణి వసంత్ కెరీర్ గ్రాఫ్ మరింత ఎత్తుకు చేరనుంది అనడం ఖాయం.

Exit mobile version