యూత్‌కు బాగా కనెక్ట్ అయిన బ్యూటి ఫుల్ లవ్ స్టోరీలో సప్తసాగరాలను దాటి మూవీ ఒకటి. కన్నడలో గుర్తింపు పొందినప్పటికీ, తెలుగుతో పాటు ఇతర డబ్బింగ్ భాషల్లో ఆశించిన స్పందన దక్కించుకోలేదు. కానీ మిడ్‌క్లాస్ అమ్మాయిగా ఎలాంటి గ్లామర్ కోటింగ్ లేకుండా, చక్కని హావభావాలతో రుక్మిణి చూపించిన నటన ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. నిజానికి, చాలా మంది రుక్మిణి కోసం సీక్వెల్ చూడగలిగేలా చేసింది. అయితే ఈ విజయంతో వెంటనే వచ్చిన అవకాశాలు రుక్మిణి ఎదుర్కొన్న షాక్ మరచిపోలేని విధంగా ఉంది.
‘బాణాదారియల్లి’, ‘భగీరా’, ‘భైరతి రానగల్’, ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’, ‘ఏస్’, ‘మదరాసి’ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఈ చేదు జ్ఞాపకాలు రుక్మిణి కెరీర్ ను చాలా డిజప్పాయింట్ చేశాయి. అయినప్పటికి రుక్మిణికి అవకాశాలు మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా ‘కాంతార చాప్టర్ 1: ఏ లెజెండ్’ రూపంలో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు గా మార్చింది, అలాగే రుక్మిణి నటనకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది. ఇక ఈ విజయంతో రుక్మిణి వసంత్ కెరీర్ లో కొత్త అధ్యాయం మొదలయింది అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఈ అమ్మడుకు సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం.
Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్‌పై బిగ్ అప్డేట్ రానుందా?
1. ధైర్యవంతమైన కుటుంబం..
రుక్మిణి తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. 2007లో జమ్మూ-కాశ్మీర్‌లోని ఉరీ ఘటనలో తన ప్రాణాలను సమర్పించి, మరణానంతరం అశోక చక్రం పొందారు. ఇలాంటి ధైర్యం, సంకల్పం రుక్మిణిని చిన్నప్పటి నుండి ప్రభావితం చేసింది.
2. తల్లి – నృత్యకళా నిపుణురాలు
రుక్మిణి తల్లి సుభాషిణి వసంత్ భరతనాట్యం నృత్యకారిణి. తన భర్తను కోల్పోయిన, ఆమె వ్యక్తిగత బాధను అందరికీ మద్దతుగా మార్చి, యుద్ధ వితంతువుల కుటుంబాలకు సహాయం చేసే ఛారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించింది. ఇలా తల్లి తన బలం, కరుణతో రుక్మిణికి ప్రతి దిశలో ప్రేరణ ఇచ్చింది.
3. ప్రతిష్టాత్మక శిక్షణ
రుక్మిణి లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (RADA)లో శిక్షణ పొందింది. అక్కడ ఆమె యాక్టింగ్, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఇండస్ట్రీలో నిలవడానికి బలమైన పునాది ఏర్పడింది.
4. సర్ఫింగ్ నేర్చుకుంది
‘బాణాదరియల్లి’ సినిమాలో రుక్మిణి పాత్ర కోసం ప్రత్యేకంగా సర్ఫింగ్ నేర్చుకుంది. కొత్త సవాళ్లను స్వీకరించడం, పాత్రకు నిజాయితీ జోడించడం ఆమె ప్రత్యేక లక్షణం. ఈ డెడికేశన్ వల్లే ఆమె సినిమాల్లో ప్రతి పాత్రలో ఫ్యాన్స్‌కి కొత్త అనుభూతిని ఇస్తు వచ్చింది. అందుకే తక్కవ సమయంలోనే అభిమానులను సంపాదించుకునేలా చేసింది.
5. సప్త సాగర దాచే ఎల్లో సినిమా
2019లో రుక్మిణి తెరంగేట్రం చేసింది, కానీ అసలు గుర్తింపు మాత్రం 2023లో విడుదలైన ‘సప్త సాగరదాచే ఎల్లో’తో వచ్చింది. ఆమె ఎమోషనల్ యాక్టింగ్‌కు విమర్శకులు మరియు ప్రేక్షకులు మెచ్చుకున్నారు. దీంతో ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు కూడా గెలుచుకుంది. ఈ సినిమా ఆమెను దక్షిణ భారత సినిమాల్లోను గుర్తింపును తెచ్చింది.
6. కాంతారా: చాప్టర్ 1 – యువరాణి కనక వతి
కాంతారా: చాప్టర్ 1 సినిమాలో రుక్మిణి యువరాణి కనకవతిగా అలరించింది. తన అందం నటనతో మరోసారి అభిమానులను కట్టి పడేసింది. అయితే ఈ మూవీ కోసం కత్తి యుద్ధం, శాస్త్రీయ నృత్యం, గుర్రపు స్వారీ లో శిక్షణ పొందిందట. దీని బట్టి ఆమె పని పట్ల అంకిత భావంను కూడా చూపిస్తుంది. ఈ ప్రదర్శన ఆమె కెరీర్‌లో మైలురాయి అని చెప్పవచ్చు.
