NTV Telugu Site icon

Ruhani Sharma: హేయ్ రుహానీ, నువ్వేనా.. ఇంత దారుణమైన సీన్‌లో దర్శనమిచ్చావ్ఏంటి?

Ruhani Intimate Scenes

Ruhani Intimate Scenes

Ruhani Sharma Intimate Scenes in Agra Movie trailer goes viral: హిమాచల్ ప్రదేశ్ కి చెందిన రుహాని శర్మ తొలుత ఒక తమిళ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు కానీ తెలుగులో చిలసౌ అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో రుహాని హీరోయిన్గా నటించింది. చిన్న సినిమానే అయినా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత తెలుగులో చేసిన హిట్ చాప్టర్ వన్ తో పాటు నూటొక్క జిల్లాల అందగాడు, డర్టీ హరి లాంటి సినిమాలు ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు తర్వాత హర్ అనే సినిమాలో పోలీస్ అధికారిగా ఆమె కనిపించింది. ఈ సినిమా కూడా విమర్శకులు ప్రశంసలు దక్కించుకుంది గాని కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిలా చాలా పద్ధతయిన పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె తాజాగా నటించిన ఒక సినిమా మాత్రం షాక్ కలిగిస్తోంది. ఆగ్రా పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను కను బెహ్ల్ (తిత్లీ ఫేమ్) డైరెక్ట్ చేశారు.

Hrithik – NTR: డాన్స్‌లో సమ ఉజ్జీల సమరం అంటే ఏంటో చూస్తారు.. గెట్ రెడీ!

ఈ చిత్రంలో ప్రియాంక బోస్, మోహిత్ అగర్వాల్, రుహాని శర్మ, విభా చిబ్బర్, సోనాల్ ఝా మరియు ఆంచల్ గోస్వామితో పాటు రాహుల్ రాయ్ వంటి వాళ్ళు నటించారు.. ఈ సినిమా 2023వ సంవత్సరంలో పలు ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్స్ లో ప్రదర్శించబడి పలు అవార్డుల సైతం గెలుచుకుంది ఇప్పుడు ఫ్రాన్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తే అందులోనే రుహాని శర్మ చేస్తున్న రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె తెలుగు సినీ అభిమానులందరూ హేయ్ రుహానీ, నువ్వేనా.. ఇంత దారుణమైన సీన్‌లో దర్శనమిచ్చావ్ ఏంటి అంటూ వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే ఆమెకు అవకాశాలు లేవు కాబట్టి ఇలాంటి పాత్రలు ఒప్పుకోవడానికి సైతం సిద్ధమైంది, అంటుంటే మరి కొందరు మాత్రం సినిమాలన్నాక ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలి. ఆమె తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి చేసింది ఏమో అంటూ ఆమెను వెనకేసుకొస్తున్నారు.