Site icon NTV Telugu

Vishwambhara : ‘విశ్వంభర’ వీఎఫ్ ఎక్స్ కోసం రూ.75 కోట్లు..?

Vishwambhara

Vishwambhara

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న మూవీ విశ్వంభర. స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ. సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమాపై తరచూ ఏదో ఒక అప్డేట్ వస్తోంది. ఈ మూవీలో భారీగా వీఎఫ్‌ ఎక్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది. కేవలం వీఎఫ్‌ ఎక్స్ కోసమే రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ప్రముఖ వీఎఫ్ ఎక్స్ కంపెనీతో ఒప్పందం కూడా జరిగిపోయిందంట. ఈ వార్త టాలీవుడ్ ను ఊపేస్తోంది. కేవలం వీఎఫ్‌ ఎక్స్ కే ఇంత భారీగా ఖర్చు చేస్తున్నారు అంటే.. సినిమాలో సిజీలు ఏ స్థాయిలో ఉంటాయో అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు.
Read Also : Pavani Reddy : రెండో పెళ్లి చేసుకున్న నటి పావనిరెడ్డి

అసలే ఈ మూవీ సోషియో ఫాంటసీగా వస్తోంది. ఈ లెక్కన మూవీలో భారీగానే వీఎఫ్ ఎక్స్ ఖర్చు చేస్తారు. కానీ ఈ స్థాయిలో అంటే.. మూవీని రియాల్టీ కంటే వీఎఫ్ ఎక్స్ మీదనే ఎక్కువగా ఆధారపడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు చివరకు వచ్చేసింది. జులై నెలలో దీన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా.. వీఎఫ్‌ ఎక్స్ పనుల కారణంగానే ఆలస్యం అయింది. రీసెంట్ గానే రామ రామ అనే పాటను కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. త్వరలో మూవీ నుంచి వరుస అప్డేట్లు వస్తాయనే టాక్ వినిపిస్తోంది.

Exit mobile version