“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. రాజమౌళి దర్శకత్వంలో మాగ్నమ్ ఓపస్ గా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ట్రైలర్ ను వాయిదా వేశారు మేకర్స్. ముందుగా ఈ ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేశారు ‘ఆర్ఆర్ఆర్’ టీం. అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ట్రైలర్ విడుదల వాయిదా వేస్తున్నాము. త్వరలోనే ట్రైలర్ కొత్త విడుదల తేదీ అనౌన్స్మెంట్ చేస్తాము అంటూ ట్వీట్ చేశారు. సినిమా వర్గాల సమాచారం మేరకు ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ డిసెంబర్ 10వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Also : ఇండస్ట్రీలో మరో విషాదం… శోకసంద్రంలో హీరో ఫ్యామిలీ
‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ పై చాలా అంచనాలు ఉన్నాయి. కాబట్టి రాజమౌళి ట్రైలర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారని, అందరినీ ఆశ్చర్యపరిచే ట్రైలర్ కట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి మరింత సమయం తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది.
